తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేరచరితులు, రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్న 18 మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిందని అరోపిస్తూ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపి అధికార ప్రతినిధి జి. భానుప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిల్ లో టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించిన వారిలో 18 మందికి నేరచరిత్ర, లేదా రాజకీయ పార్టీలతో సంబంధాలు వున్నాయని పేర్కోన్నారు. గతంలో దాఖలైన ఈ పిటీషన్ ను విచారించేందుకు స్వీకరించిన న్యాయస్థానం పిల్ లో పేర్కోన్నవారికి నోటీసులు దాఖలు చేయాలని అదేశించింది.
భాను ప్రకాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి లతో కూడిన రాష్ట్రోన్నత న్యాయస్థాన ధ్విసభ్య ధర్మాసనం విచారించింది. అయితే తాము అందజేసిన నోటీసులను తీసుకోవడానికి ముగ్గురు టీటీడీ ట్రస్టుబోర్డు సభ్యులు నిరాకరించారని తెలిపారు. హైకోర్టు జారీచేసిన నోటీసులను వారు తిప్పిపంపించారని భాను ప్రకాశ్ రెడ్డి తరపు న్యాయవాది ఎన్ అశ్వనీ కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అయితే నోటీసులను తిరస్కరించిన వారికి స్థానిక దినపత్రికల్లో ప్రకటనల ద్వారా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు పిటీషనర్ కు సూచిచింది.
తమపై కేసులు ఎదుర్కొంటున్న కొందరిని టీటీడీ ట్రస్ట్ బోర్డులో నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ట్రస్ట్‌బోర్డు సభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎంఎన్ శశిధర్, అల్లూరి మహేశ్వరిలకు పంపిన నోటీసులు తిరిగి వచ్చాయని, మరికొందరు నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. నోటీసులను ఆమోదించిన వారు తమ కౌంటర్ దాఖలు చేయాలని కోరిన ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more