సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్త దేశాలు అన్నింటికీ క్రమంగా వ్యాపించిన ఈ సరికొత్త వేరియంట్.. అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. అమెరీకన్ల వెన్నులో చలిపుట్టించేలా చేయడానికి ముఖ్యకారణం అక్కడ ఈ వేరియంట్ పిల్లల్లో అధికంగా సోకడమే కారణం. గత కొద్ది రోజులుగా అగ్రరాజ్యంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ.. మునుపటి అత్యధిక స్థాయిలను మించి నమోదువుతున్నాయి. సోమవారం ఒక్కరోజునే ఏకంగా పదిలక్షల కొత్త కేసులను నమోదయ్యేలా చేసింది. ఈ మేరకు అమెరికా వార్తా సంస్థ యూఎస్ఏ టుడే కథనాన్ని వెల్లడించింది.
దీన్ని బట్టి కరోనా కొత్త వేరియంట్ ఎంతటి వేగంతో వ్యాప్తి చెందుతుందో ఇట్టే అర్థమౌతోంది. అయితే అమెరికాలో ఈ మేర కొత్తకేసులు నమోదు కావడానికి అక్కడి ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలు ప్రధాన కారణంగా అక్కడి వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా పలు ఆంక్షలను అధికారులు అమలులో పెట్టినా.. ప్రజలు విస్మరించడంతోనే కొత్త కేసులు సంఖ్య గతంలో కంటే మూడింతలు పెరిగి పది లక్షల మేర నమోదయ్యాయని కథనంలో యూఎస్ఏ టుడే పేర్కోంది. ఇక దీనికి తోడు ప్రతీ రోజు కనీసం 500 మంది టీనేజ్ బాలబాలికలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి 7.30 గంటల వరకు అమెరికా వ్యాప్తంగా 10,42,000 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు గత గురువారం అమెరికాలో ఒక్కరోజే 5.91లక్షల కేసులు బయటపడగా.. తాజాగా దానికి రెట్టింపు కేసులు నమోదవడం కలవరపెడుతోంది. గత వారంలో ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరు వైరస్ బారినపడినట్లు యూనివర్సిటీ పేర్కొంది. కాగా తాజాగా ప్రతి అరుగురిలో ఒకరు కరోనా మూడవ దశ ప్రభవం బారిన పడ్డారు. అంటే అమెరికాలో మొత్తం 505 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడ్డారు.
ఇక దీంతో ఏకంగా లక్షకు పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే వారిలో 18 వేలకు పైగా బాధితులు ఐసీయూలో వున్నారని తెలిపింది. గత ఏడాది ఇదే సంవత్సరంలో అత్యధికంగా 1.42లక్షల మంది అసుపత్రి పాలవ్వగా, ఇప్పుడు అదే స్థాయిలో అసుపత్రిలో చేరికలు అందోళనకు గురిచేస్తోంది. ఇక ఇప్పటివరకు అమెరికాలో 8.26 లక్షల మందికి పైడా మహమ్మారి బలితీసుకుందని జాన్ హాపి్కన్స్ డేటా వెల్లడించింది. ఇక అగ్రారాజ్యంలో కరోనా టీకా కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 62శాతం మంది అమెరికన్లు డబుల్ డోస్ వాక్సీన్ ను తీసుకున్నారు. కాగా వీరికి తాజాగా బూస్టర్ డోసులను కూడా అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... Read more
Aug 08 | గవర్నమెంటు జాబ్ కోసం దేశవ్యాప్తంగా ఎందరెందరో విద్యార్థులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వమైనా.. లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైనా తమకు లభిస్తే.. తమకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని.. దీంతో ఇక తమ జీవితం... Read more
Aug 08 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్ర సంస్థలను తమ చెక్కుచేతల్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలపై వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అరోపించింది. మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అందుకు ఎన్ఫోర్స్మెంట్... Read more
Aug 08 | పుట్టిన రోజు వేడుకల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో స్వయంగా రాజకీయ నాయకులే చట్టాలను అతిక్రమించి మరీ బర్త్ డే పార్టీలలో తుపాకీలతో... Read more
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more