Amid Covid rise, weekend curfew imposed in Delhi ఢిల్లీలో వారాంతపు కర్ప్యూ.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్.!

Weekend curfew in delhi from friday 10 pm to monday 5 am amid covid surge

Coronavirus, delhi, arvind kejriwal, Weekend curfew in Delhi, Weekend curfew from Friday to Monday, Weekend curfew amid Covid surge, coronavirus pandemic, ddma, delhi govt colour coded system, covid 19, delhi covid restrictions, delhi lockdown, delhi lockdown, National, Covid In Delhi, Coronavirus in delhi, Arvind Kejriwal, Covid-19 Delhi News, Delhi Covid-19, Delhi Coronavirus Cases,Yellow Alert, Arvind Kejriwal News, Delhi Covid-19 Updates, Delhi covid news

Amid spike in Covid cases, the Delhi government has imposed a weekend curfew from Friday 10pm to Monday 5am in the national capital. All employees of government offices will shift to “Work From Home” mode — except for those associated with the Essential Services category.

ఢిల్లీలో ఒమిక్రాన్ అలర్ట్: వారాంతపు కర్ప్యూ.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్.!

Posted: 01/04/2022 05:37 PM IST
Weekend curfew in delhi from friday 10 pm to monday 5 am amid covid surge

కొత్త రూపం దాల్చుకుని వచ్చిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ మన దేశ రాజధాని ఢిల్లీలోనూ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 4099 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ క‌ట్ట‌డి కోసం శుక్ర‌వారం నుంచి వీకెండ్ క‌ర్ఫ్యూ విధించాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఢిల్లీలో శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ వీకెండ్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. క‌రోనా వైర‌స్ కేసులు ప్ర‌బ‌లుతుండ‌టంతో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇంటి నుంచి ప‌నిచేసేందుకు అనుమ‌తించింది. అత్య‌వ‌స‌ర సేవ‌ల విభాగంలో ప‌నిచేసే ఉద్యోగులు మిన‌హా మిగిలిన ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం వెసులుబాటు క‌ల్పించింది.

కాగా, డిసెంబ‌ర్ నెలాఖ‌రు నుంచి ఢిల్లీలో క‌రోనా వైర‌స్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. సోమ‌వారం దేశ రాజ‌ధానిలో ఏకంగా 4099 కొవిడ్‌-19 కేసులు వెలుగుచూడ‌టంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. గ‌త రెండురోజులుగా న‌మోద‌వుతున్న కేసుల్లో 84 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వేన‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ వెల్ల‌డించారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెర‌గ‌డం కొన‌సాగితే మ‌రికొన్ని నియంత్ర‌ణ‌లు అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బెడ్ ఆక్యుపెన్సీ పెరిగితే ఎలాంటి క‌ఠిన నియంత్ర‌ణ‌లు చేప‌ట్టాల‌నే దానిపై నిపుణుల క‌మిటీ ప‌రిస్ధితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని చెప్పారు.

కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం ఇదివరకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లు, ఆడిటోరియంలను పూర్తిగా మూసివేయాలని అదేశించింది. దీంతో పాటు జిమ్‌లు, స్పా సెంటర్లు, యోగా ఇనిస్టిట్యూట్‌లు కూడా మూతపడ్డాయి. ఇక పాఠశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను కూడా మూసివేయాలని ప్రభుత్వం అదేశించింది. దీంతో పాటు సామాజిక, రాజకీయ, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది.  

అయితే హోటళ్లు తెరుచుకునే అవకాశాన్ని ఇచ్చినా.. బాంకెట్‌ హాల్స్‌, కాన్ఫరెన్స్‌ హాళ్లపై మూసివేత ఆంక్షలు కోనసాగుతున్నాయి. ఇక రెస్టారంట్లను 50శాతం సామర్థ్యంతో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరుచుకోవచ్చు. బార్లు 50శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరిచేందుకు అనుమతించారు. ఇక క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్స్ ను కూడా మూసివేయాలన్న అంక్షలలో ఎలాంటి మార్పులు లేవు.

ఢిల్లీ మెట్రో సహా ఆర్టీసీ బస్సులలో మాత్రం నూరుశాతం సామర్థ్యంతో నడుస్తాయి. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లలో గంటల సమయం ప్రయాణికులు నిలబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా మార్పులు చేసింది. ఢిల్లీలో ఏకంగా 331 ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు నమోదు కావడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల మెట్రో, ప్రజారవాణా సర్వీసులలో 50శాతం మేర ప్రయాణికులతో నడుస్తాయని తెలిపిన విషయం తెలిసిందే. ఇక దీంతో ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా నూరు శాతం సామర్థ్యంతో నడవనున్నాయి. అయితే ఆటోలు, టాక్సీలు, ఈ-రిక్షాల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి.

ఇక ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ వెసలుబాటును కల్పించారు. అయితే అత్యవసర సర్వీసుల ఉధ్యోగులు మాత్రం తమ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 50శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు ఎల్లో అలర్ట్ నేపథ్యంలో విధించిన ఆంక్షలు అమల్లో వుంటాయని.. వీటిల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. పబ్లిక్‌ పార్కులు తెరిచే ఉంటాయి. అవుట్‌డోర్‌ యోగాతో పాటు సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తెరుచుకునే వెసలుబాటు ఉంది.

ఈ అంక్షలకు తోడు వారంతపు కర్ఫ్యూ కూడా అమల్లోకి వచ్చిందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇవాళ వెల్లడించారు. శుక్రవారం రాత్రి పదిగంటల నుంచి సోమవారం ఉదయం వరకు కర్ప్యూ అమల్లో వుంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవ్వరూ బయటకు రాకూడదని కోరారు. ఈ కర్ప్యూతో ఒమిక్రాన్ వేరియంట్ ను కట్టడి చేయాలన్న తమ ప్రయత్నాలకు ప్రజల సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు ప్రతి రోజు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ప్యూ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles