PM Modi was adamant over farm laws: Satya Pal Malik స్వరం మార్చిన సత్యాపాల్.. మేఘాలయ గవర్నర్ దిద్దుబాటు చర్యలు

Claims of what amit shah said on pm now a clarification

Satya Pal Malik, Satya Pal Malik modi, Satya Pal Malik narendra modi, Satya Pal Malik news, Satya Pal Malik interview, PM Modi, pm modi farm laws, Farmers Issues, Amit Shah, Satya Pal Malik Latest News, PM Modi News, Amit Shah News

Following the controversy over the video where he called Prime Minister Narendra Modi 'arrogant', Meghalaya Governor Satya Pal Malik has claimed that the PM was not "flexible" enough on the farm laws. Speaking about the meeting, Satya Pal Malik said that PM Modi's attitude was very rigid on the farm laws as he was not ready to change anything in them.

ప్రధానికి మతి తప్పిందన్న ‘షా’ వ్యాఖ్యలపై స్వరం మార్చిన సత్యపాల్

Posted: 01/04/2022 03:27 PM IST
Claims of what amit shah said on pm now a clarification

రైతుల ఆందోళనల విషయంలో కేంద్రప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్న మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో ఆయన తన స్వరాన్ని మార్చారు. వెంటనే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రి అమిత్ షాకు ప్రధాని నరేంద్రమోడీ అంటే చాలా గౌరవమని చెప్పుకోచ్చారు. ఆయన ఎప్పుడు మోడీ గురించి చెడు ఉద్దేశంతో మాట్లాడరని అన్నారు. ప్రధాని మోడీకి చెడును అపాదించే విధంగా ఎలాంటి వ్యాఖ్యాలు చేయలేదన్నారు. రైతులపై తన అందోళన అర్థమయ్యిందని మాత్రమే అన్నారని వివరణ ఇచ్చారు.

ఇంతలా ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే.. హర్యానాలోని చర్ఖీ దాద్రీలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యాపాల్ మాలిక్‌ మాట్లాడుతూ.. రైతుల ఆందోళనల విషయమై తాను ఇటీవల మోదీతో సమావేశం అయ్యానని, అందులో అన్నదాతల మరణాలపై మోదీ అహంకారపూరితంగా మాట్లాడారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయింది. అంతేకాదు మాలిక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో పెను సంచలనంగా మారాయి. ప్రతిపక్ష నేతలు కూడా విస్మయం చెందేలా చేసిన ఆయన వ్యాఖల వెనుక కీలక విషయాలు ఏమీటన్న వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల తాను ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యానని చెప్పుకోచ్చిన సత్యపాల్ మాలిక్.. ఈ సందర్భంగా రైతు సమస్యలపై మాట్లాడానని అన్నారు. ‘‘ప్రధానితో భేటీ అయిన ఐదు నిమిషాలకే వాగ్వాదం మొదలైంది. 500 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని నేను చెప్పాను. ఓ కుక్క చనిపోయినా మీరు సంతాప లేఖ పంపుతారు కదా అని అడిగాను. వారు నా కోసం చనిపోయారా.? అని అహంకారంతో ప్రశ్నించారు మోడీ. దానికి నేను ‘అవును.. మీరే పాలకులు కాబట్టి’ అని సమాధానమిచ్చాను. చివరకు గొడవతో ఆ సమావేశం ముగిసింది. అమిత్‌ షాను కలవమని ప్రధాని నాకు చెప్పారు’’ అని పేర్కొన్నారు.

అమిత్‌ షాను కలిసిన తర్వాత జరిగిన సంభాషణనూ అందులో వివరించారు. ‘‘ఆయనకు(మోదీ) మతి తప్పింది. కొందరు ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. ఏదో రోజు ఆయనకు వాస్తవం బోధపడుతుంది. మీరు ఇవేం పట్టించుకోకండి. మమ్మల్ని కలుస్తూ ఉండండి అని షా నాతో చెప్పారు’’ అని మాలిక్‌ ఆ వీడియోలో చెప్పడం తీవ్ర చర్చకు దారి తీసింది. వీడియోలో తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మాలిక్‌ తన స్వరాన్ని మార్చారు. ‘‘రైతుల సమస్యలకు సంబంధించి ప్రధాని నా అభిప్రాయాలను వినడానికి తిరస్కరిస్తూ అమిత్‌ షాను కలవమన్నారు. షాకు మోదీపై చాలా గౌరవం వుంది. ఆయన పట్ల ఎంతో గౌరవంగానే ఆయన మాట్లాడారు అని మాలిక్‌ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles