Man sentenced for showing middle finger to woman మహిళకు మధ్య వేలు చూపినందుకు ఆరు నెలల జైలు శిక్ష

Mumbai court convicts 33 year old for showing middle finger to 66 year old woman

Mumbai court, Girgaon Magistrate Court, Road Rage, 66 Yrs old woman, Aniket Patil, Gavdevi Police Station, simple imprisonment, Maharashtra, Crime

A Mumbai court recently convicted a 33-year-old man for making vulgar gestures at a 66-year-old woman in an incident of road rage. The accused, identified as Aniket Patil, 33 has been convicted for using abusive words and “showing his middle finger” to a 66-year-old woman in a road rage incident and sentenced to six months simple imprisonment by the Girgaon Magistrate Court

మహిళకు మధ్య వేలు చూపినందుకు ఆరు నెలల జైలు శిక్ష

Posted: 12/13/2021 03:37 PM IST
Mumbai court convicts 33 year old for showing middle finger to 66 year old woman

విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకోల్పిన కార్పోరేట్ పాఠశాల ప్రభావమో ఏమో తెలియదు కానీ.. పెద్దలను గౌరవించవలెను అన్న నానుడికి ఈ తరం వారు అసలు పట్టించుకోవడం లేదు. తమకు తోచిన విధంగా వ్యవహరిస్తూ.. పాశ్చాత మోజులో తమ ఇంటి సంస్కృతి సంప్రదాయాలను పక్కనబెట్టేస్తున్నారు. రోడ్డుపై ఎవరైనా పెద్దలు తమ వాహనాలను నడిపించుకుంటూ వెళ్తుంటే వారికి కంగారు పెట్టకుండా.. వారికి కొంత దూరం నుంచే వెళ్లేవాళ్లను చూశాం. కానీ ఏకంగా వారి కారుకు అడ్డంగా వెళ్లి.. వారిని కంగారు పెట్టి.. ట్రాఫిక్ జామ్ కు కారణమయ్యే వారిని చాలా అరుదుగా చూస్తుంటాం.

ఇక అందులోనూ తల్లి వయస్సులో వున్నవారితో అమర్యాదగా మాట్లాడమే కాకుండా.. అసభ్యకరంగా వ్యవహరించడంతో ఓ 66 ఏళ్ల వృద్దురాలికి ఆగ్రహం తెప్పింది. తన పట్ల అసభ్యకరంగా వ్వవహరించి.. మధ్య వేలు చూపించిన ఓ యువకుడిపై కేసు పెట్టింది. దీంతో ముంబైలోని స్థానికి గిర్ గావ్ మెజిస్ట్రేటు కోర్టు.. యువకుడికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళ్తే 2018 సెప్టెంబర్ 17న ఓ మహిళ తన కుమారుడితో కలిసి కారులో ఆఫీసుకు వెళ్తుండగా అకస్మాత్తుగా ఎడమ వైపు నుంచి మరో కారు వారి కారు ముందుకు వచ్చింది. దీంతో వారు కంట్రోల్ కోల్పోయారు. ఆమె కారు 100 మీటర్ల వరకు అడ్డదిడ్డంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత ఎలాగోలా కంట్రోల్ లోకి వచ్చింది. ఆ తర్వాత సిగ్నల్ వద్దకు వచ్చి ఆగింది.

అదే సమయంలో మరో కారు వచ్చి వారి కారు పక్కన ఆగింది. అయితే సదరు మహిళ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వచ్చిందంటూ కారులోని 33 ఏళ్ల వ్యక్తి వారిని దూషిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా... ఆమె కుమారుడు తమ కారును ఆ వ్యక్తి కారుకు అడ్డుగా పెట్టాడు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆ తర్వాత పోలీసులు సీన్ లోకి ఎంటరై తల్లీకుమారులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అయితే, వాదనలు జరుగుతున్న సమయంలో మహిళకు ఆ యువకుడు మధ్య వేలిని చూపించాడు. దీంతో, ఆ యువకుడిపై సదరు మహిళ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును విచారించిన కోర్టు యువకుడికి శిక్షను విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai court  Road Rage  66 Yrs old woman  Aniket Patil  Gavdevi Police Station  Maharashtra  Crime  

Other Articles