Miss India Harnaaz Sandhu crowned Miss Universe 2021 దేశానికి ‘మిస్ యూనివర్స్’ కిరీటీన్ని అందించిన ‘మిస్ ఇండియా’ ముద్దుగుమ్మ

India s harnaaz sandhu brings home miss universe crown after 21 years

harnaaz kaur sandhu, harnaaz kaur sandhu miss universe, harnaaz kaur sandhu parents, harnaaz kaur sandhu height weight, harnaaz kaur sandhu instagram, Miss Universe 2021, Harnaaz Sandhu Height, harnaaz sandhu miss universe 2021, harnaaz sandhu miss universe winner, india miss universe, harnaaz sandhu miss universe 2021 winner, who is harnaaz sandhu, harnaaz sandhu instagram

India's Harnaaz Sandhu is the new Miss Universe, 21 years after Lara Dutta won the title in 2000. Ms Sandhu represented India today at the 70th Miss Universe 2021, held in Eilat, Israel. The 21-year-old from Punjab claimed the crown edging out Paraguay's Nadia Ferreira and South Africa's Lalela Mswane.

ITEMVIDEOS: దేశానికి ‘మిస్ యూనివర్స్’ కిరీటీన్ని అందించిన ‘మిస్ ఇండియా’ ముద్దుగుమ్మ

Posted: 12/13/2021 01:30 PM IST
India s harnaaz sandhu brings home miss universe crown after 21 years

విశ్వసుందరిగా భారత సుందరి హర్నాజ్ కౌర్ సంధు అవతరించారు. మిస్ ఇండియాగా గెలిచిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా మిస్ యూనివర్స్ అందాల పోటీలో ప్రతిష్టాత్మక కిరీటాన్ని అందుకుంది. దేశవిదేశాలకు చెందిన అనేక మంది ముద్దుగుమ్ములు ఎందరో ఈ పోటీలో పాల్గోన్నా.. అందరినీ తోసిరాజుతూ.. తన అద్భుతమైన చతురత, మేధోసంపత్తితో అగ్రబాగన నిలిచి విశ్వసుందరిగా అవతరించింది. పంజాబ్ కు చెందిన 21 ఏళ్ల హర్నాజ్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు గత నెలన్నర రోజులుగా పడిన కష్టం అమెకు దానిని సోంతం చేసుకునేలా చేసింది.

ఇజ్రాయిల్ లోని ఇలాత్ లోగల డోమ్ యూనివర్సిటీలో జరిగిన ఈ అందాల పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు పోటీ పడ్డారు. చివరి రౌండ్ లో కేవలం ఇద్దరి మధ్య పోటీ నెలకొనగా, భారత్ కు చెందిన హర్నాజ్ ను విజేతగా అవతరించారు. 21 ఏళ్ల తర్వాత భారత్ కు మళ్లీ విశ్వసుందరి కిరీటం దక్కడం గమనార్హం. చివరిసారి బాలీవుడ్ నటి లారా దత్తా మిస్ యూనివర్స్ టైటిల్ దక్కించుకున్నారు.

మిస్ యూనివర్స్ ఫైనల్స్ లో పరాగ్వేకు చెందిన నాడియా ఫెర్రీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలేలా ఎంస్వానేలతో హర్నాజ్ పోటీ పడి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 2020లో విశ్వసుందరిగా ఎంపికైన మెక్సికోకు చెందిన ఆండ్రియా మేజా... హర్నాజ్ కు కిరీటాన్ని అలంకరించారు. చండీగఢ్ కు చెందిన హార్నియా మోడలింగ్ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఓవైపు చదువుతూనే... మరోవైపు మోడలింగ్ చేస్తూ, అందాల పోటీల్లో పాల్గొంటున్నారు. 2021లో హార్నియా మిస్ దివాగా ఎంపికయ్యారు.

2019లో ఫెమీనా మిస్ ఇండియా పంజాబ్ టైటిల్ ను గెలుచుకున్నారు. 2019 ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో టాప్ 12 స్థానాల్లో నిలిచారు. తాజాగా విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న హార్నియాపై అభినందనల జల్లు కురుస్తోంది. ఆమె అందానికి అందరూ ముగ్ధులవుతున్నారు. విశ్వసుందరి పోటీల్లో మన దేశం విషయానికి వస్తే 1994లో సుస్మితాసేన్, 2000లో లారా దత్తా ఈ టైటిల్ ను గెలుపొందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harnaaz Sandhu  harnaaz kaur sandhu  miss India  miss universe 2021  Punjab  India  

Other Articles