సీబీఎస్ఈలో మహిళలను కించపర్చేలా ప్రశ్నలా.?: సోనియాగాంధీ

Sonia raises misogynistic passage in cbse paper in lok sabha seeks withdrawal apology

cbse english paper, sonia gandhi, cbse english paper paragraph, rahul gandhi, cbse papers, education ministry, lok sabha, sonia gandhi lok sabha, parliament news, cbse news, lok sabha news, priyanka gandhi, cbse, english paper, comprehensive passage, Lok sabha, parliament, National Politics

Terming a passage in the English paper of the Class X CBSE exam as “atrocious, shockingly regressive and blatantly misogynist”, Congress president Sonia Gandhi on Monday demanded in the Lok Sabha that it be withdrawn immediately and the CBSE should issue an apology. Sonia also urged the ministry of education to conduct a review on gender sensitivity standards of curriculum and testing.

సీబీఎస్ఈలో మహిళలను కించపర్చేలా ప్రశ్నలా.?: పార్లమెంటులో సోనియాగాంధీ

Posted: 12/13/2021 04:38 PM IST
Sonia raises misogynistic passage in cbse paper in lok sabha seeks withdrawal apology

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ 10వ త‌ర‌గ‌తి ఆంగ్ల‌ ప‌రీక్ష‌లో మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర్చేలా ఒక కాంప్ర‌హెన్సివ్ ప్యాసేజ్ ఇవ్వ‌డంపై కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. దీనిపై న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పి.. ఈ ప్యాసెజ్ ను రద్దు చేసి తప్పుదిద్దుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. బీజేపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతల ధోరణి పూర్తిగా మారిపోయిందని అన్నారు. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంపై ఆమె మండిపడ్డారు. ఇక ఈ ప్రభావాన్ని భవిష్యత్ తరంపై కూడా రుద్దేలా చర్యలకు పూనుకోవడం సహేతుకం కాదని అన్నారు.

బీజేపి నేతలు తాము పురుషహాంకార సమాజంలో ఉన్నామని, మహిళలను తమ బాసినలుగా మలుచుకుని మళ్లీ ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను తీసుకువచ్చేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని అమె ప్రశ్నించారు. సోమ‌వారం లోక్‌స‌భ జీరో అవ‌ర్‌లో సోనియా ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. ప్ర‌భుత్వం వెంట‌నే ఆ ప్ర‌శ్న‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని, ఈ ఘోర త‌ప్పిదంపై స‌మీక్ష చేయించాల‌ని సోనియాగాంధీ డిమాండ్ వినిపించారు. కాగా, గ‌త‌ శ‌నివారం సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి ఆంగ్ల ప‌రీక్ష జ‌రిగింది.

ఆ ప‌రీక్ష‌లో ఇచ్చిన ఓ కాంప్ర‌హెన్ష‌న్ ప్యాసేజ్ లో మ‌హిళల‌ను కించ‌ప‌ర్చే వాఖ్యలు ఉన్నాయి. మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ‌నిస్తే చిన్నారులపై త‌ల్లిదండ్రులు ఆదిప‌త్యం కోల్పోతారు అనేది అందులో ఒక వాక్యం. భ‌ర్త మార్గంలో న‌డుచుకోవ‌డం ద్వారానే త‌ల్లి వ‌యోజనులైన పిల్ల‌ల విధేయ‌త‌ను పొందగ‌ల‌దు అని మ‌రో వాఖ్యం ఉన్న‌ది. దీనిపై ప్ర‌భుత్వం సమాధానం చెప్పాల‌ని లోక్‌స‌భ‌లో సోనియా ప‌ట్టుబట్టారు. ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్‌, డీఎంకే, ఐయూఎంఎల్‌, ఎన్‌సీపీ, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ స‌భ్యులు స‌భ నుంచి వాకౌట్ చేశారు.


రాహుల్, ప్రియాంక స్పందన ఇలా

ప‌దోత‌ర‌గ‌తి సీబీఎస్ఈ ఆంగ్ల ప్ర‌శ్నాప‌త్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విస్మ‌యం వ్య‌క్తం చేశారు. యువ‌త భ‌విష్య‌త్‌ను వారి నైతిక స్ధైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఆరెస్సెస్‌, బీజేపీల కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. మ‌హిళ‌ల విముక్తి పిల్ల‌ల‌పై త‌ల్లితండ్రుల ఆధిప‌త్యాన్ని నాశనం చేసింద‌ని శ‌నివారం నిర్వ‌హించిన సీబీఎస్ఈ ఆంగ్ల ప‌రీక్ష ప్ర‌శ్నాప‌త్రంలో పొందుప‌రిచిన నేప‌ధ్యంలో రాహుల్ ఈ అంశంపై ట్వీట్ చేశారు.

తన భర్త మార్గాన్ని అంగీకరించడం ద్వారానే తల్లి పిల్ల‌ల‌పై విధేయతను పొందగలదని మ‌రో వాక్యంలో పొందుప‌రిచారు. చిన్నారులు క‌ష్ట‌ప‌డి పైకి ఎద‌గాల‌ని, మూఢ‌విశ్వాసాలు ఉప‌క‌రించ‌వ‌ని రాహుల్ పిలుపు ఇచ్చారు. మ‌రోవైపు సీబీఎస్ఈ ఆంగ్ల ప్ర‌శ్నాప‌త్రంలో దొర్లిన వాక్యాల‌పై కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇది లింగ అస‌మాన‌త‌ల‌ను, పురోగ‌మ‌న ఆలోచ‌న‌ల‌ను ప్రేరేపించేలా ఉంద‌ని అభివ‌ర్ణించారు. మ‌హిళ‌ల‌పై తిరోగ‌మ‌న ఉద్దేశాల‌ను బీజేపీ విశ్వ‌సించ‌ని ప‌క్షంలో సీబీఎస్ఈ క‌రిక్యులంలో వీటిని ఎందుకు ప్ర‌స్తావించార‌ని ఆమె ప్ర‌శ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles