Man Floats In Salt Pool in Egypt ఈ నీళ్ల‌లో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్స‌లు మున‌గ‌రు: వైర‌ల్ వీడియో

The ithaca of egypt siwa oasis has a soul as mystic

Siwa Oasis, Egypt, Egypt Salt Lakes, Egypt Salt Pools, Siwa Oasis Egypt, Viral Siwa Oasis Video

A man was seen floating in a salt pool at Egypt's Siwa Oasis. The man, Kene Nwobu, entered the small but deep pool dressed in all white clothes. Nwobu says he travels to a new country every month and had planned to visit the Siwa Oasis for two years but was delayed because of COVID-19 lockdowns.

ITEMVIDEOS: ఈ నీళ్ల‌లో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్స‌లు మున‌గ‌రు

Posted: 12/09/2021 08:37 PM IST
The ithaca of egypt siwa oasis has a soul as mystic

సాధార‌ణంగా నీళ్ల‌లో ఈత కొట్టాలంటే ఖ‌చ్చితంగా ఈత రావాల్సిందే. లేదంటే మునిగిపోతారు. కానీ.. ఈ పూల్‌లో మాత్రం మ‌నుషులు మునిగిపోరు. ఈత రాని వాళ్లు కూడా నీటి మీద తేలియాడుతారు. అక్క‌డ ఉన్న ఏ పూల్‌లో అయినా అంతే. దానికి కార‌ణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. ఇంత‌కీ ఆ పూల్స్ ఎక్క‌డున్నాయి అంటారా? ఈజిప్ట్‌లోని సివా ఒయాసిస్‌లో ఉన్న పూల్స్ గురించే మ‌నం మాట్లాడుకునేది. అక్క‌డ ఎక్కువ‌గా సాల్ట్ పూల్స్ ఉంటాయి.

స‌ముద్ర‌పు నీటి కంటే కూడా ఆ నీళ్లు చాలా ఉప్పుగా ఉంటాయి. అందుకే వాటిని సాల్ట్ పూల్స్ అంటారు. అయితే.. ఆ సాల్ట్ పూల్స్‌లోకి దిగితే ఈత వ‌చ్చినా రాకున్నా.. మ‌నిషి అందులో మున‌గ‌డు. ఏ వ‌స్తువు వేసినా కూడా మున‌గ‌దు. మ‌నుషులు నీటి మీద తేలియాడుతారు. ఈత కొట్ట‌కుండా.. నీళ్ల మీద అలాగే ప‌డుకోవ‌చ్చు. దానికి కార‌ణం.. ఆ నీళ్ల‌లో ఉండే ఉప్పు సాంద్ర‌త‌. ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఇక్క‌డ అన్వ‌యించుకోవాలి. ఉప్పు సాంద్ర‌త ఆ నీటిలో అత్య‌ధికంగా ఉండ‌టం వ‌ల్ల‌.. ఆ నీటిలోకి ఏ వ‌స్తువూ మున‌గ‌దు.

మ‌నుషులు కూడా అంతే. సివా ఒయాసిస్‌లో ఇటువంటి సాల్ట్ పూల్స్ వంద‌ల‌కొద్దీ ఉన్నాయి. ఈ సాల్ట్ పూల్స్‌లోకి దిగి కాసేపు నీటిలో ఉంటే.. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కంటి ఇన్ఫెక్ష‌న్ సంబంధ సమ‌స్య‌లు, సైన‌స్ లాంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయ‌ట‌. ఇదంతా నిజ‌మేనా.. న‌మ్మేట‌ట్టుగా లేదు.. మ‌నుషులు తేలియాడ‌టం ఏంటి.. అని ఇంకా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siwa Oasis  Egypt  Egypt Salt Lakes  Egypt Salt Pools  Siwa Oasis Egypt  Viral Siwa Oasis Video  

Other Articles