HC allows TDP women Leaders anticipatory bail plea టీడీపీ మహిళా నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు

Andhra pradesh high court allows tdp women leaders anticipatory bail plea

TDP women Leaders, Anticipatory bail, Andhra Pradesh High Court, Anantapur Fourth Town Police Station, CM YS Jagan, EX-CM Chandrababu Naidu, Bhuvaneshwari, T.Swapna, P.VijayaLakshmi, KC Janaki, S.Tejeshwini, House raids, CRPC section 41A, Police notices, Ananatapur SP, Andhra pradesh, Crime

The Andhra Pradesh High Court has allowed anticipatory bail application of Anantapur district Telugu desam party women leaders against FIR registered on them on making the derogatory comments on Andhra Pradesh Cheif Minister YS Jagan Mohan Reddy and his Family members.

హైకోర్టులో టీడీపీ మహిళా నేతలకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

Posted: 12/10/2021 11:18 AM IST
Andhra pradesh high court allows tdp women leaders anticipatory bail plea

అనంతపురం టీడీపీ మహిళా నేతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం నలుగురు టీడీపీ మహిళా నేతలకు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో టీడీపీ మహిళా నేతలకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ మహిళా నేతలు దాఖలు చేసిన ముందస్తు పిటీషన్లపై విచారించిన న్యాయస్థానం ఈ సందర్భంగా పోలీసులపై మండిపడింది.

నలుగురు మహిళా నేతలు టి.స్వప్న, పగిడి విజయశ్రీ, కురుబ చిత్రజానకి, ఎస్‌.తేజస్విలపై ఉన్న అభియోగాలు ఏంటీ అని ప్రశ్నించింది. అయితే వారి ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించి సోదాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఈ పూర్తి వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని అనంతపురం జిల్లా ఎస్పీని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డి.రమేశ్‌ ఆదేశాలిచ్చారు. కాగా తెలుగుదేశం మహిళా నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైన విషయం తెలిసిందే.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా టీడీపీ మహిళా నేతలు టి.స్వప్న, పగిడి విజయశ్రీ, కురుబ చిత్రజానకి, ఎస్‌.తేజస్విని విలేకరుల సమావేశంలో సీఎం, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు నమోదయ్యాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కాగా పోలీసులు తాము సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులిచ్చి వివరణ కోరామని తెలిపగా.. న్యాయస్థానం మాత్రం ముందుస్తు బెయిల్‌ మంజూరు చేసి వారికి ఊరట కల్పించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles