Sanjay Raut raises doubts over Gen Bipin Rawat's death రావత్ హెలికాప్టర్ క్రాష్ పై స్వామి, రౌత్ లకు అనుమానాలు

Subramanian swamy seeks sc judge monitored probe into iaf chopper crash

CDS Gen Bipin Rawat, IAF chopper crash, Bipin Rawat, BJP MP Subramanian swamy, Sanjay Raut, IAF chopper crash, Coonoor, Tamil Nadu, Crime

Rajya Sabha MP Subramanian Swamy sought a probe by a senior Supreme Court Judge into the helicopter crash near Coonoor in Tamil Nadu that killed India's first CDS, General Bipin Rawat, his wife and 11 others, The former Union Minister termed the incident as "shocking" and a big caution to national security.

రావత్ హెలికాప్టర్ క్రాష్ పై స్వామి, రౌత్ లకు అనుమానాలు

Posted: 12/09/2021 08:10 PM IST
Subramanian swamy seeks sc judge monitored probe into iaf chopper crash

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 11 మందిని బలిగొన్న ఎయిర్ ఫోర్స్ ఎంఐ 17వి5 హెలికాప్టర్ క్రాష్ ఘటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి.. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కూలిపోతున్న హెలికాప్టర్ గా చెబుతూ ప్రచారమవుతున్న వీడియోను తాను అత్యంత విశ్వసనీయమైన వర్గాల ద్వారా చూశానని... వాస్తవానికి అది సిరియన్ వైమానిక దళానికి చెందినదని, బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నది కాదని చెప్పారు.

రావత్, ఆయన భార్య, ఇతర అధికారులు ఎలా మరణించారనే విషయంలో అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జి వంటి వారి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిందనే వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని స్వామి చెప్పారు. ఇది దేశ భద్రతకే పెద్ద హెచ్చరిక అని అన్నారు. ఈ ఘటనపై తుది నివేదిక రావాల్సి ఉందని... అప్పటి వరకు ఏం చెప్పాలన్నా కష్టమేనని తెలిపారు. తమిళనాడు వంటి ఒక సురక్షిత ప్రాంతంలో హెలికాప్టర్ పేలిపోవడం అనుమానాస్పదమని చెప్పారు. ఈ ఘటనపై కట్టుదిట్టమైన దర్యాప్తు జరగాలని అన్నారు.

దేశ తొలి త్రివిధ ద‌ళాధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ మర‌ణించిన ఘ‌ట‌నపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ పలు ప్రశ్న‌లు లేవనెత్తారు. ఈ ఘ‌ట‌నపై ప్రజ‌ల మ‌న‌సుల్లో ప‌లు ప్ర‌శ్న‌లు మెదులుతున్నాయ‌ని అన్నారు. అత్యాధునిక‌, సుర‌క్షితమైన హెలికాఫ్ట‌ర్లో త్రివిధ దళాధిపతికే రక్షణ కరువైందని అన్నారు. ఆయన ప్రయాణిస్తుంటే ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌ని రౌత్ ప్ర‌శ్నించారు. ఇది అత్యంత దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌ని, దేశ సుప్రీం క‌మాండ‌ర్ సుర‌క్షిత‌మైన ఆధునిక హెలికాఫ్ట‌ర్లో ప్ర‌యాణిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌ని, టాప్ క‌మాండ‌ర్‌ను ప్ర‌మాదంలో ఎందుకు కోల్పోయామ‌ని ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయ‌ని శివ‌సేన ఎంపీ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles