On Omicron, WHO Shares A New Concern ఒమిక్రాన్‌ వ్యాప్తిపై అనిశ్చితి.. వ్యాక్సీన్లు అందని దేశాలు జాస్తి: డబ్ల్యూహెచ్‌ఓ

Who says omicron variant could change the course of the covid pandemic

Dr Tedros Adhanomfour, concers over new variant, Omicron Variant, spreading vigourously, delta variant, corona vaccine, omicron, WHO, Omicron, WHO report on Omicron, WHO latest report on Omicron, Covid, Covid Omicron, WHO latest report, omicron latest news, omicron updates

The World Health Organization said early data indicates that Omicron, the latest variant of the SARS-CoV-2 first found in South Africa, may easily infect people who have either been infected earlier or vaccinated. But the disease will be milder than what the Delta variant led to, WHO said.

ఒమిక్రాన్‌ వ్యాప్తిపై అనిశ్చితి.. వ్యాక్సీన్లు అందని దేశాలు జాస్తి: డబ్ల్యూహెచ్‌ఓ

Posted: 12/09/2021 07:22 PM IST
Who says omicron variant could change the course of the covid pandemic

ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తిపై ఇంకా అనిశ్చితి వీడటం లేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచదేశాలను డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తున్నది. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇదే సమయంలో, ఇది ప్రాణాంతకమా? అనేది వెల్లడించడం తొందరే అవుతుందని తెలిపింది. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం 57 దేశాల్లో బయటపడింది. దీని బారిన పడే వారి సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ వేరియంట్‌కు సంబంధించిన పలు కీలకమైన ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రాలేదు. రానున్న రోజుల్లో అందే డాటా ఆధారంగా దీని ప్రభావం ఎంత ఉంటుందో చెప్పగలమని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంటున్నది. గత నెలలో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు షురూ అయ్యాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలను తిరిగి అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ దాదాపు 26.7 కోట్ల మందికి సోకగా.. దాదాపు 52 లక్షల మంది చనిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్యంగా వ్యాధి ప్రబలడం, తీవ్రత, తిరిగి ఇన్‌ఫెక్షన్‌ కావడం, టీకాల ప్రభావం.. అనే నాలుగు అంశాలపై తమ ఆందోళనను వ్యక్తం చేసింది.

డెల్టా ట్రాన్స్‌మిషన్‌ తక్కువగా ఉన్నప్పుడు ఒమిక్రాన్‌ బయటపడిందని, ఫలితంగా అప్పుడు ఒమిక్రాన్‌ పోటీ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ ఎంత మేరకు ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యవేక్షణ చాలా ముఖ్యమన్నారు. ఇక తమ ఆందోళన అంతా డెల్టా మహమ్మారిపైనే ఉన్నది. కొత్త వేరియంట్‌తో ఏమి జరుగుతుందో కూడా గమనిస్తున్నాం. ఇప్పటివరకు 40 శాతం వ్యాక్సిన్ కవరేజీ లక్ష్యాన్ని చేరుకోలేని 50 కి పైగా దేశాలు ఉన్నాయి. ఇదే మమ్మల్ని తీవ్రంగా కలవరపెడుతున్నది’ అని డబ్ల్యూహెచ్‌ఓ ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్స్‌, బయోలాజికల్స్ విభాగం డైరెక్టర్‌ కేట్ ఓబ్రెయిన్ వెల్లడించారు. ఇలాఉండగా, తమ కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షించగలదని ఫైజర్‌ సంస్థ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dr Tedros Adhanomfour  concern  new variant  Omicron Variant  delta variant  corona vaccine  omicron  WHO  

Other Articles