12 RS MPs suspended for protests in Monsoon Session క్షమాపణలు చెబితే పునరాలోచన.. బాహుబలి ఎత్తుగడలన్న విపక్షం

12 rajya sabha mps suspended for entire session opposition calls it undemocratic

MPs suspended, Rajya Sabha MPs suspended, Rajya sabha MPs, opposition MPs suspended, MP rajya sabha opposition suspended, Rajya Sabha, 12 MPs, monsoon session, winter session, Mallikarjun Kharge, Venkaiah Naidu, Prahlad Joshi, Adhir Ranjan Chowdhury, Parliament

In a move that angered the Opposition and set the stage for acrimonious exchanges, a dozen members of Opposition parties in Rajya Sabha were suspended from the winter session on the very first day following a motion brought in by the government. The members were suspended for alleged unruly conduct towards the end of the monsoon session in August

క్షమాపణలు చెబితే పునరాలోచన.. బాహుబలి ఎత్తుగడలన్న విపక్షం

Posted: 11/30/2021 04:31 PM IST
12 rajya sabha mps suspended for entire session opposition calls it undemocratic

రాజ్య‌స‌భలో గత వర్షాకాల సమావేశాల చివరిరోజున సభలో గంధరగోళానికి కారణమైన 12 మంది రాజ్యసభ సభ్యులపై శీతాకాల సమావేశాల తొలిరోజునే స‌స్పెన్ష‌న్ విధించిన విష‌యం తెలిసిందే. వర్షాకాల స‌మావేశాల్లో చివ‌రి రోజున ఎదురైన ఘటనలు, అనుచిత ప్రవర్తన మరోమారు పునారావృతం కాకుండా వారిని శీతాకాల స‌మావేశాల్లో పూర్తిగా స‌స్పెండ్ చేశారు. కాగా ఈ అంశంపై ఇవాళ రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. 12 మంది ఎంపీల‌పై విధించిన స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని కోరుతున్నామ‌ని రాజ్యసభ కాంగ్రెస్ విపక్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే డిమాండ్ చేశారు.

వ‌ర్షాకాల స‌మావేశాల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై శీతాకాల సమావేశంలో చర్యలు తీసుకోవడం ఏమిటని ఆయన ప్ర‌శ్నించారు. దీనిపై స్పందించిన రాజ్యసభ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు.. వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఎదురైన చేదు అనుభ‌వాలు ఇంకా వెంటాడుతున్నాయ‌ని అన్నారు. ర‌భస సృష్టించిన ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకునే హ‌క్కు చైర్మ‌న్ కు ఉంద‌ని తెలిపారు. స‌స్పెన్ష‌న్ ఎత్తివేత అభ్య‌ర్ధ‌న‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌ను తిర‌స్క‌రించ‌డంతో.. విప‌క్ష స‌భ్యులు రాజ్య‌స‌భ నుంచి వాకౌట్ చేశారు. ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్టారు.

కాగా ఈ అంశంపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. సభకు ఆ 12 మంది సభ్యులు క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ పై పునరాలోచన చేస్తామని అన్నారు. లేని పక్షంలో సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. సభ గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయాల్సిందిగా ప్రభుత్వం ప్రతిపాదించిందని పేర్కొన్నారు. రేపట్నుంచి సభలో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉందని, కాబట్టి సభా సమావేశాలు ఫలప్రదంగా జరిగేందుకు ప్రతి పార్టీ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాటిపై ఆరోగ్యకరమైన చర్చకు సహకరించాలన్నారు.

రాజ్య‌స‌భ‌లో 12 మంది విప‌క్ష ఎంపీల‌ను స‌స్పెండ్ చేయ‌డాన్ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ త‌ప్పుప‌ట్టింది. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ లోక్‌స‌భాప‌క్ష నాయ‌కుడు అధిర్ రంజ‌న్ చౌద‌రి మీడియాతో మాట్లాడుతూ.. మెజారిటీ వ‌ర్గం బాహుబ‌లి ఎత్తుగ‌డ‌లు ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. గ‌త సెష‌న్లో త‌ప్పిదాల‌కు ఈ సెష‌న్‌లో శిక్ష‌లు విధించడం విచిత్రంగా ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. ఇది ప్ర‌తీకార చ‌ర్య కొనసాగుతున్న‌దని అన్నారు. స‌భ‌లో మ‌మ్మ‌ల్ని బుల్డోజ్ చేయ‌డం, భ‌య‌పెట్ట‌డం, మా త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించ‌కుండా మా అవకాశాల‌ను లాక్కోవ‌డం అనేది మోదీ ప్ర‌భుత్వ కొత్త వ్యూహం. పార్ల‌మెంటులో ఇలాంటి ప్ర‌తీకార ధోర‌ణిని తాము మునుపెన్న‌డూ చూడ‌లేదు అని అధిర్ రంజ‌న్ చౌద‌రి వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles