Uttarakhand govt scraps Chardham Devasthanam board అర్చకుల ఫోరాట ఫలితం..చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు రద్దు..

Victory for priests as uttarakhand government scraps char dham devasthanam board act

Uttarakhand Char dham bill, Char dham yatra, Pushkar Singh Dhami, Char Dham Shrine Management Bill, Assembly elections, Uttarakhand assembly elections, Trivendra Singh Rawat, Uttarakhand government

Uttarakhand Chief Minister Pushkar Singh Dhami announced the repealing of the Char Dham Devasthanam Board Act which has been a bone of contention between priests and the government.

చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు రద్దు.. ప్రకటించిన ఉత్తరాఖండ్ సీఎం

Posted: 11/30/2021 05:12 PM IST
Victory for priests as uttarakhand government scraps char dham devasthanam board act

ఆలయ అర్చకుల ఎడతెరపి లేని పోరాటంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. ఆలయ అర్చకుల డిమాండ్లను నెరవేర్చడంలో భాగంగా చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డును ర‌ద్దు చేసింది. ఛార్ ధామ్ బోర్డు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగిన ఆలయ అర్చకులు ఎట్టకేలకు విజయం సాధించారు. చార్ ధామ్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుస్క‌ర్ సింగ్ ధామి ప్ర‌క‌టించారు. అన్ని అంశాల‌ను అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత‌.. చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డును 2019లో ఏర్పాటు చేశారు. అయితే ఆ బోర్డును ర‌ద్దు చేయాల‌ని స్థానిక పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆల‌యాల సాంప్ర‌దాయ హ‌క్కులు అడ్డుకుంటున్న‌ట్లు వాళ్లు ఆరోపించారు. దేవ‌స్థానం బోర్డుపై ఏర్పాటు చేసిన ఉన్న‌త స్థాయి క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం ధామి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌నోహ‌ర్ కంట్ ద‌యానీ నేతృత్వంలోని బృందం రిపోర్ట్‌ను త‌యారు చేసింది. దేవ‌స్థానం బోర్డు కింద 51 ఆల‌యాల నిర్వ‌హ‌ణ ఉండేది. కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్‌, య‌మునోత్రి, గంగోత్రీ ఆల‌యాలు కూడా ఆ బోర్డు ప‌రిధిలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles