No cases of Omicron Covid-19 variant in India దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసూ నమోదు కాలేదు: కేంద్రఅరోగ్యశాఖ మంత్రి

No case of omicron reported in india so far mansukh mandaviya

Coronavirus, Omicron, Omicron in India, Mansukh Mandaviy, Parliament Winter Session, Mansukh Mandaviya in Rajya Sabha, Union Health Minister, Mansukh Mandaviya, Omicron Variant, Rajya Sabha, Rupa Ganguly, Prime Minister Narendra Modi, Arvind Kejriwal, TB app, TB cases, Parliament, India

Union Health Minister Mansukh Mandaviya said that no cases of new COVID-19 variant 'Omicron' have been reported in the country, so far. "No case of COVID-19 variant Omicron has been reported in India so far," Mandaviya said in Rajya Sabha during Question Hour today.

దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసూ నమోదు కాలేదు: కేంద్ర అరోగ్యశాఖ మంత్రి

Posted: 11/30/2021 03:25 PM IST
No case of omicron reported in india so far mansukh mandaviya

బెంగళూరులో ఇద్దరు.. మహారాష్ట్రలో ఒకరు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులు కరోనాతో బాధపడటంతో అత్యంత ప్రమాదకరంగా, వేగంగా వ్యాప్తి చెందేదిగా నిపుణులు హెచ్చరిస్తున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్ అని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇవాళ ఇదే విషయంమై పార్లమెంటులో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సూక్ మాండవీయ బదులిస్తూ.. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ వేరియంట్ కేసు న‌మోదు కాలేద‌ని తెలిపారు. ఇవాళ రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ ను నియంత్రించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఒమిక్రాన్ వైరస్ ను అదిలోనే నియంత్రించే చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టిందని చెప్పిన ఆయన.. విమానాశ్ర‌యాల వ‌ద్ద స్క్రీనింగ్ చేస్తున్నామ‌ని, పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపులో భాగంగా టెస్టింగ్ ను పెంచాల‌ని అన్నిరాష్ట్రాల‌ను ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా హైరిస్క్ ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. కొత్త వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ద‌క్షిణాఫ్రికాలో తొలుత క‌నిపించిన ఈ వేరియంట్ ఇప్పుడు ప‌లు దేశాల్లో విజృంభిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి వేళ టీబీ వ్యాధి టెస్టింగ్‌పై ప్ర‌భావం ప‌డిందా అన్న ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. నిజానికి టీబీ వ్యాధిగ్ర‌స్తుల గుర్తింపు స్వ‌ల్పంగా త‌గ్గింద‌ని, కానీ దాన్ని మ‌ళ్లీ రెట్టింపు చేయ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 2025 వ‌ర‌కు దేశం నుంచి క్ష‌య వ్యాధిని నిర్మూలించాల‌న్న సంక‌ల్పంతో కేంద్ర ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. కోవిన్ యాప్ త‌ర‌హాలో టీబీ కోసం ఓ యాప్‌ను రూపొందించాల‌ని ఎంపీ రూపా గంగూలీ డిమాండ్ చేశారు.

ఇక ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి ఇదివరకే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపేయాల‌ని కోరారు. ద‌క్షిణాఫ్రికా స‌హా ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి ఇప్ప‌టికే అనేక దేశాలు విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, మరి భార‌త్ ఎందుకు ఆలస్యం చేస్తోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కరోనా మొదటి ద‌శ విజృంభ‌ణ స‌మ‌యంలో ఇదే ధోరణితో వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఎక్కువశాతం మంది ఢిల్లీలో దిగడం కారణంగా ఇక్కడ ఆ వైర‌స్ వ‌ల్ల‌ దేశరాజధానే ఎక్కువగా ప్రభావితమవుతోందని ఆయ‌న అందోళన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles