Shashi Tharoor ‘attractive’ women MPs gets him trolled మహిళా ఎంపీలకు క్షమాపణలు చెప్పిన శశిథరూర్

Shashi tharoor apologises after selfie with women mps receives backlash

Congress MP Shashi Tharoor, women Parliament Members, Supriya Sule, Preneet Kaur, Thamizhachi Thangapandian, Mimi Chakraborty, Nusrat Jahan, Jothimani, attractive place to work, show of workplace camaraderie, Shashi Tharoor selfie with six women MPs, attractive, Shashi Tharoor, Lok Sabha, social media viral

Congress MP Shashi Tharoor found himself in trouble after he posted a picture with six women Members of Parliament while commenting on how Lok Sabha is ‘an attractive place to work’. The post, which came at the start of the Winter Session of Parliament, has been criticised for being sexist.

మహిళా ఎంపీలతో ఫోటోలు దిగి.. క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

Posted: 11/30/2021 01:39 PM IST
Shashi tharoor apologises after selfie with women mps receives backlash

పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభ ప్రాంగణంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పార్టీలు వేరైనా తామంతా దేశ ప్రజలకు సేవకులమే అన్న తమను తాము ఒక్కటిగా నిరూపించుకునే ప్రయత్నంలో కొందరు మహిళా ఎంపీలు అక్కడకు వచ్చిన తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ తో కలసి సెల్పీ దిగారు. ఇక మన ఎంపీ ఆ ఫోటోను తన సామాజిక మాద్యమంలో పోస్టు చేశారు. ఇలా సాధారణంగా పోస్టు చేసినా సరిపోయేదేమో కానీ.. ఏకంగా ఆయన పోస్టు కింద ఓ క్యాప్షన్ కూడా పెట్టి మరీ పోస్టు చేశారు. దీంతో ఆయన తన క్యాప్షన్ ను వెంటనే వెనక్కు తీసుకోవాల్సి రావడంతో పాటు పలువురికి క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.

అసలేం జరిగిందంటే.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో.. లోక్ సభకు వచ్చిన శశిథరూర్ తో కలసి కొందరు మహిళా ఎంపీలు సెల్ఫీ దిగారు. ఇలా ధరూర్ తో కలసి ఫోటోలు దిగిన వారిలో నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి, ప్రణీత్ కౌర్, జ్యోతిమణి, సుప్రియా సూలే, తమిళచ్చి తంగపాండియన్ లతో కలిసి దిగిన ఆ ఫొటోను శశి థరూర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతవరకు బాగానే వున్నా.. ఆ ఫోటో కింద ఆయన పెట్టిన క్యాప్షన్ కాస్తా వివాదాస్పదంగా మారి ఆయనను విమర్శలపాలు చసింది.

ఆయన జోడించిన క్యాప్షన్ నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే... మహిళా ఎంపీలు ఉన్నప్పుడు లోక్ సభ ఆకర్షణీయమైన పని ప్రదేశం కాదని ఎవరన్నారు? అంటూ వ్యాఖ్యానించారు. శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల అమర్యాదకరంగా ఉన్నాయని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో థరూర్ వెంటనే స్పందించారు. ఎవరినీ బాధించాలని తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, తనను క్షమించాలని కోరారు. ఎంతో సరదగా ఆ ఫొటో తీసుకున్నామని, ఆ ఫొటోను ట్వీట్ చేయాలని మహిళా ఎంపీలే కోరారని వివరణ ఇచ్చారు.

అటు ఎంపీ వ్యాఖ్యల పట్ల జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. పార్లమెంటులోనూ, రాజకీయాల్లోనూ ఎంతో చురుగ్గా వ్యవహరిస్తున్న మహిళలు మీకు ఆకర్షణీయ వస్తువుల్లా కనిపిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. పార్లమెంటులో ఈ విధంగా మహిళలను అగౌరవపరిచే విధంగా వ్యవహరించడం మానండి అంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ హితవు పలికారు. ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నందీ కూడా వెలిబుచ్చారు. మహిళా ఎంపీల రూపంపై వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అయితే, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విభిన్నంగా స్పందించారు. పార్లమెంటులో మహిళా ఎంపీలందరికీ ఇదొక అభినందనగా ఎందుకు భావించకూడదని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడరాదని జ్వాల హితవు పలికారు. మొత్తానికి సరదాగా దిగిన సెల్పీ కూడా మన టైం బాగోలేకపోతే క్షమాపణలు చెప్పిస్తుందని ఇప్పుడు మన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ పార్లమెంటు సభ్యుడికి అర్థమయ్యే ఉంటుంది. సమయానికి క్షమాపణలు చెప్పి తప్పించుకున్నాడు కానీ.. లేదంటే.. ఈ వివాదం ఎక్కడికి దారితీసేదో మరి.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles