Police Searches on for Sandhya MD in double registration case సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోసం పోలీసుల గాలింపు

Cyberabad police searches on for sandhya md sreedhar rao in double registration case

Saranala Sreedhar Rao, Cherlapally Central Jail, Sandhya Conventions, Sandhya Constructions and Estates, Bangalore, Chaitanya Krishna Murthy Gogineni, Rowa & Company Associates LLP, Hyderabad, Crime

The Cyberabad Police started searches for the MD of Sandhya Conventions, Saranala Sreedhar Rao in double registrations case, who is being absconding after comming out from Jail on Bail. Earlier the Police arrested him from his hideout in Bangalore and lodged him at the Cherlapally Central Jail under a 14-day remand.

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోసం పోలీసుల గాలింపు

Posted: 11/27/2021 05:04 PM IST
Cyberabad police searches on for sandhya md sreedhar rao in double registration case

రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చేసిన కొందరు తమ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి కోట్టు సంపాదించగా, మరికోందరు మాత్రం నమ్మకాలకు, నీతి, నిజాయితీలకు తిలోదకాలు ఇచ్చి.. వ్యాపార రంగంలో మెసాలకు పాల్పడి.. తప్పించుకు తిరుగుతున్నారు. ఈ రెండో కోవకు చెందినవారే సంద్య కన్వెన్సన్ ఎండీ శ్రీధర్ రావు. బిల్డర్లను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి బెయిలుపై బయటకు వచ్చిన ఆయన.. ఎటు వెళ్లారు.. ఎక్కడ వున్నారు.? అన్న వివరాలు తెలియకుండా కనిపించకుండా పోయారు. దీంతో ఆయనపై వున్న కేసులలో విచారణకు రావాలని ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.

వివరాల్లోకి వెళ్తే.. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు బిల్డర్లను మోసం చేశారంటూ అటు నార్సింగి, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. వీటి నుంచి తప్పించుకుని బెంగుళూరులో నక్కిన ఆయనను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, ఆయన గత వారం రోజుల క్రితం జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. అయితే స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్న ఆయన గత నాలుగు రోజులుగా ఎవరికీ కనిపించమే లేదు. తమ పోలిస్ స్టేషన్ల పరిధిలోని పలు కేసుల విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.

విచారణకు హాజరుకావాలంటూ ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్లాది రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్‌రావును ఈ నెల 18న బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే బెయిలుపై వచ్చిన ఆయన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు. కాగా, తన నుంచి రూ. 11 కోట్లు తీసుకుని ప్లాట్ అప్పగించకపోవడమే కాకుండా బెదిరింపులకు కూడా దిగుతున్నాడంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ సహా హైదరాబాద్, ముంబైకి చెందిన పలువురు బిల్డర్లను శ్రీధర్‌రావు మోసం చేసినట్టు కూడా తేలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ శారీసెంటర్ యజమానురాలిని కూడా మోసం చేసినట్టు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles