Woman posing as customs officer dupes man of Rs 84L కస్టమ్స్ అధికారినంటూ వ్యాపారిని బురడీ కొట్టించిన మహిళ.!

Woman posing as customs officer dupes man of rs 84l on pretext of selling gold bars at cheaper rates

Pune, Crime, Maharashtra, Pune news, pune latest news, pune news today, pune crime news, pune fraud incidents, fruad cases in pune, pune chichwad crime rate

In yet another fraud incident, a 35-year-old resident of Shivajinagar gaothan lodged a complaint against the duo for duping him of Rs 84 lakh. The incident came to light on Thursday after a complaint was filed in this case by a man saying a woman posing as a customs officer duped him on the pretext of giving gold bars at cheaper rates.

కస్టమ్స్ అధికారినంటూ వ్యాపారిని రూ.84 లక్షల మేర బురడీ కొట్టించిన మహిళ.!

Posted: 11/27/2021 06:27 PM IST
Woman posing as customs officer dupes man of rs 84l on pretext of selling gold bars at cheaper rates

పైన దగా, కింద దగా, కుడిఎడమల దగాదగా అని ఎవరెంతగా చెప్పినా.. వినిపించుకోని కొందరు సరిగ్గా మోసగాళ్లు చేసే మోసానికి మాత్రం బుట్టలోపడి విలువైన సోమ్మును కోల్పోతుంటారు. కుడి చేతితో తింటూ ఎడమ చేతితో కాకిని కోట్టనివారు కూడా అత్యాశకు పోయి.. మోసగాళ్ల ఉచ్చులో పడి సంపదను పోగోట్టుకుంటారు. తాజాగా మహారాష్ట్రలోని ఫూణే ప్రాంతంలోని శివాజీనగర్ గోతాన్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కూడా మహిళా కస్టమ్స్ అధికారి కారు చౌకగా బంగారుకడ్డీలను తెచ్చిస్తానని చెప్పగానే అత్యాశకుపోయాడు.

అమె చేతికి డబ్బు ఇవ్వడమే కాకుండా ఆమె అకౌంట్ ఖాతాకు కూడా డబ్బులు వేసి.. రెండు నెలలుగా ఎదురుచూస్తూనే వున్నాడు. అయితే అమె నుంచి తనకు బంగారు కడ్డీలు రావని పూర్తిగా నిర్థారించుకని తాను మోసపోయానని తెలుసుకున్న తరువాత చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. బంగారు కడ్డీల పేరుతో స్థానిక వ్యాపారిని ఏకంగా రూ.84 లక్షల మేర మోసం చేసిన ఘటన మహారాష్ట్ర ఫూణేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని 35 ఏళ్ల శివాజీనగర్ గోతాన్ అనే వ్యాపారి వద్దకు గత సెప్టెంబర్ మాసంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఓ మహిళ కూడా వుంది.

అయితే ఆ మహిళా తనకు తాను కస్టమ్స్ అధికారినని చెబుతూ బాధితుడితో ప‌రిచ‌యం పెంచుకుంది. విదేశాల నుంచి కొందరు అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని తాము విమానాశ్రయంలో పట్టుకున్నామని.. అయితే అందులో కొంత తాను ఎవరికీ తెలియకుండా తీసి దాచానని నమ్మబలికింది. దానిని అత‌క్కువ ధరకే విక్రయిస్తానని నమ్మబలికింది. దీంతో అమెను గుడ్డిగా నమ్మిన వ్యాపారి నిందితురాలికి రూ 71.60 ల‌క్ష‌ల నగదుతో పాటు ఆన్‌లైన్ ద్వారా మ‌రో రూ 12.40 ల‌క్ష‌లు ఆమె బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ పర్ చేశానని చెప్పాడు. రెండు నెలలైనా తనకు బంగారం రాకపోవడంతో పోలీసుల‌ను ఆశ్రయించానని బాధితుడు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles