MP Min Apologises For 'Thakur Women' Remark అగ్రవర్గాల మహిళలకు మంత్రి క్షమాపణలు.. వ్యాఖ్యలు వెనక్కి

Madhya pradesh minister apologises for remarks about upper caste women

women of thakurs, Madhya pradesh minister, Bisahulal Singh, Bisahulal Singh, thakur caste, thakur women, Upper caste women, Equality, Minister comments, Rajput community, minister stokes row, madhya pradesh, Politics

Madhya Pradesh minister Bisahulal Singh on Friday, November 26, apologised for hurting the sentiments of women or any community. This comes after he had recently stated that certain upper caste communities kept their women restricted to their homes and such women “should be dragged out” and made to work in society to ensure equality.

అగ్రవర్గాల మహిళలకు మంత్రి క్షమాపణలు.. వ్యాఖ్యలు వెనక్కి

Posted: 11/27/2021 03:03 PM IST
Madhya pradesh minister apologises for remarks about upper caste women

అగ్రవర్ణ కుటుంబాల్లోని మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని, వారు కూడా బయటకు వచ్చి పురుషులతో కలిసి పనిచేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ క్షమాపణలు చెప్పారు. మూడు రోజుల క్రితం అనుప్పుర్ జిల్లాలో సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత మాట్లాడుతూ.. ఠాకూర్, థాకరే వంటి అగ్రకులాల్లోని మహిళలను ఇళ్లకే పరిమితం అవుతున్నారని, ఆయా వర్గాల మహిళలు కూడా బయటకు వచ్చి పనిచేయాలని అన్నారు.

అయితే అగ్రవర్గాల మహిళలను కూడా ఇళ్లల్లోంచి బయటకు ఈడ్చి మరీ పనిచేయించాలని.. సభకు హాజరైన ప్రజల సాక్షిగా చెప్పిన ఆయన.. ఇప్పడు గొంతు సవరించుకున్నారు. ఆయా వర్గాల మహిళలను బయట పనులకు పంపేందుకు అంగీకరించని సమాజం.. కిందిస్థాయి వర్గాల కుటుంబాల్లోని మహిళలు మాత్రం ఇళ్లలోను, పొల్లాలోనూ పని చేస్తున్నారని చెప్పారు.సమాజంలో స్త్రీపురుషులు సమానమే అయినప్పుడు మహిళలు కూడా తమ బలాన్ని గుర్తించి పురుషులతో కలిసి పనిచేయాలని అన్నారు.

కాబట్టి అగ్రవర్ణాల మహిళలను బయటకు లాగి సమానత్వాన్ని తీసుకురావాలని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో దిగొచ్చిన మంత్రి బిసాహులాల్ క్షమాపణలు చెప్పారు. అయితే, తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. మహిళలు సామాజిక సేవ చేయాలని మాత్రమే తాను అన్నానని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles