క్రిప్టోకరెన్సీపై మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలను చేశారు. క్రిప్టోకరెన్సీని అన్ రెగ్యులేటెడ్ చిట్ ఫండ్ గా, తులిప్ మానికగా అభివర్ణించినా ఆయన.. ఇవి పూర్తిగా నీటి బుడగలాంటివని వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రిప్టో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీంతో రఘురాం రాజన్ దీనిపై స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 6000కు పైగా క్రిప్టోకరెన్సీ చెలామణీలో ఉందని, రాబోయే రోజుల్లో కేవలం ఒకటి లేదా రెండు క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉండవచ్చుని అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా ప్రస్తుత క్రిప్టో ధరలు పూర్తిగా నీటి బుడగలాంటిదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నడుస్తోన్న క్రిప్టో క్రేజ్‌ను 17వ శతాబ్దం నాటి నెదర్లాండ్స్ తులిప్ మానియాతో అభివర్ణించారు. క్రిప్టో కరెన్సీలను అన్-రెగ్యులేటెడ్ చిట్ ఫండ్స్‌తో రఘురాం రాజన్ పోల్చారు. చిట్‌ఫండ్స్ నుంచి డబ్బులు పొందిన వారిలాగే క్రిప్టో ఆస్తులు కలిగినవారు కూడా రాబోయే రోజుల్లో బాధపడక తప్పదని అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి అసలు వ్యాల్యూ లేదన్నారు. క్రిప్టోలో కొన్ని మాత్రమే చెల్లింపుల కోసం మనుగడ సాగిస్తాయని..వాటిలో కూడా క్రాస్ బార్డర్ పేమెంట్స్ వాడతారని తెలిపారు.
భారత్‌లోని 15-20 మిలియన్ల క్రిప్టో ఇన్వెస్టర్లు సుమారు 5.39 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీను కలిగివున్నారని తెలిపారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021ని లోకసభలో ప్రవేశపెట్టనుంది. ఈ క్రిప్టో బిల్లులో ఆర్బీఐచే జారీ చేయబడే అధికారిక డిజిటల్ కరెన్సీ కోసం ప్రేమ్ వర్క్, దేశంలో అన్ని ప్రయివేటు క్రిప్టోల నిషేధం లేదా కఠిన నిబంధనలతో పాటు క్రిప్టో కరెన్సీ అంతర్లీన టెక్నాలజీని ప్రోత్సహించేందుకు కొన్ని మినహాయింపులను అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more