MP minister stokes row commenting on Thakurs women ‘‘ఠాకూర్ మహిళలను ఇళ్ల నుంచి ఈడ్చి పనిచేయించాలి’’

Women of thakurs should be dragged out and made to work mp minister stokes row

women of thakurs, Madhya pradesh minister, Bisahulal Singh, Bisahulal Singh, thakur caste, thakur women, Upper caste women, Equality, Minister comments, Rajput community, minister stokes row, madhya pradesh, Politics

Madhya Pradesh minister said that the women of the Rajput community, also known as Thakurs, and other upper castes should be dragged out of their houses and made to work in society to ensure equality.

ITEMVIDEOS: అగ్గి రాజేస్తున్న మంత్రి వ్యాఖ్యలు.. ‘‘ఠాకూర్ మహిళలను ఇళ్ల నుంచి ఈడ్చి పనిచేయించాలి’’

Posted: 11/25/2021 07:13 PM IST
Women of thakurs should be dragged out and made to work mp minister stokes row

మ‌ధ్య‌ప్ర‌దేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి బిసాహులాల్ సింగ్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు రాష్ట్రంలో అగ్గిరాజేస్తున్నాయి. రాజ్ పుత్ సామాజికవర్గానికి చెందిన మహిళలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వర్గాల మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. స‌మాజంలో స‌మాన‌త్వం సాధించేందుకు అణగారిన వర్గాలకు చెందిన మహిళలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన మహిళలు కూడా కష్టపడిపనిచేయాలని అన్నారు. అంతటితో ఆగకుండా.. ఠాకూర్లుగా వ్య‌వ‌హ‌రించే రాజ్‌పుత్ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల‌తో పాటు ఇత‌ర అగ్ర‌వ‌ర్ణ మ‌హిళ‌ల‌ను ఇండ్ల నుంచి బ‌య‌ట‌కి లాగి వారితో ప‌ని చేయించాల‌ని అన్నారు.

మంత్రి బిసాహులాల్ సింగ్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో కూడిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. అనుప్పుర్ జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ “ఠాకూర్ల‌తో పాటు ఇత‌ర అగ్ర కులాలు త‌మ మ‌హిళ‌ల‌ను ఇండ్ల‌కు ప‌రిమితం చేశాయి..స‌మాజంలో ప‌నిచేసేందుకు వారిని అనుమ‌తించ‌డం లేదు.. స‌మాన‌త్వం సాధించేందుకు ఠాకూర్ల‌తో పాటు ఇత‌ర అగ్ర‌కులాల మ‌హిళ‌ల‌ను ఇండ్ల‌ నుంచి బ‌య‌ట‌కు లాగి వారితో ప‌ని చేయించాల‌”ని సింగ్ ఆ వీడియోలో అన్నారు.

అయితే దీనిపై రాజ్ పుత్ సహా ఇతర అగ్రవర్ణాలకు చెందిన మహిళలు మండిపడుతున్నారు. సమానత్వం కోసం ఉపన్యసించే ముందు ఎలాంటి ప్రసంగాలు చేయాలో.. చేయకూడదో కూడా తెలియదా.? అంటూ మహిళలు విరుచుకుపడుతున్నారు. ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా మంత్రివ్యాఖ్యలను తప్పబడుతున్నారు. తమ ఇంటి మహిళలపై వ్యాఖ్యలు చేసే అవసరం మంత్రికి ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను మీరు వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles