Chiranjeevi donates Rs 3 lakh for Siva Shankar's treatment శివశంకర్ మాస్టార్ అత్యవసర వైద్యం కోసం మెగాస్టార్ సాయం..

Megastar chiranjeevi donates rs 3 lakh in charity for siva shankar s treatment

Chiranjeevi, charity, Help, financial aid, siva shankar, choreographer, ajay, coronavirus, private hospital, AIG Hospital, Treatment, Tollywood

It's known that choreographer Siva Shankar has been undergoing treatment at a private hospital in Hyderabad after he caught coronavirus. The news is that Megastar Chiranjeevi has done his bit to help the family of the critically-ill patient tide over the crisis.

శివశంకర్ మాస్టార్ అత్యవసర వైద్యం కోసం మెగాస్టార్ సాయం..

Posted: 11/26/2021 08:48 PM IST
Megastar chiranjeevi donates rs 3 lakh in charity for siva shankar s treatment

ప్రముఖ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడి ప్రాణాపాయస్థితిలో ఉన్నారన్న వార్త తెలియగానే ఆయనకు మద్దతుగా పలువురు సినీప్రముఖులు అండగా నిలిచారు. ఈ వార్త తెలియగానే మాస్టర్ కుటుంబసభ్యులతో తాను టచ్ లో వున్నానని రియల్ హీరో సోనూసూద్ ప్రకటన చేయగా, ఆ తరువాత తమిళ హీరో ధనుష్ కూడా మాస్టారుకు అండగా వుంటూ ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక తాజాగా టాలీవుడ్ కు చెందిన మెగాస్టార్ చిరంజీవి కూడాశివశంకర్ మాస్టారుకు అర్థిక సాయం అందించడంతో పాటు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మాస్టారు ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడం వల్ల 75 శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో చికిత్సకు తగిన డబ్బు సహాయం చేయమని శివశంకర్ కుటుంబ సభ్యులు దాతలసాయం కోరారు. మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల‌ ఆర్ధిక సాయం చేసిన చిరంజీవి.. ఆయన వైద్యానికి సంబంధించిన వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. చిరంజీవిని క‌లిసి చెక్ అందుకున్న శివ శంక‌ర్ మాస్ట‌ర్ త‌న‌యుడు అజ‌య్ మాట్లాడుతూ.. నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు అని వెల్లడించారు.

చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం అని పేర్కొన్న అజయ్.. చిరంజీవి గారితో నాన్నగారు కలిసి సినిమాలు చేశారని వెల్లడించారు. ఇటీవల ఆచార్య షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి చేసిన సాయం ఎన్నటికీ మరువలేని ఆయనకి ఎన్నటికీ రుణపడి ఉంటానని ” అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles