Singer Harini father's mysterious death గాయని హరిణి తండ్రి అనుమానాస్పద మృతి

Singer harini family missing father dies under mysterious circumstances

Singer Hairini, AK Rao, Srinagar colony, Sujana Foundation CEO, Realtor, Bengaluru, Railway Tracks, Murder, Karnataka, Hyderabad, crime

Harini is a popular playback singer and classical singer who sings in Tamil, Hindi, Telugu and Kannada films, working with many leading film composers. She is married to another playback singer, Tippu. Now according to the latest report, Harini’s father AK Rao died under mysterious circumstances. The body of AK Rao was found near a railway track in Bengaluru.

గాయని హరిణి కుటుంబం అదృశ్యం.. తండ్రి అనుమానాస్పద మృతి

Posted: 11/25/2021 03:43 PM IST
Singer harini family missing father dies under mysterious circumstances

ప్రముఖ నేపథ్య గాయని హరిణి కుటుంబంలో విషాదం అలుముకుంది. కొన్ని రోజులుగా అదృశ్యమైన అమె కుటుంబంలో విషాదకర వార్త నిండింది. గత వారం రోజులుగా కనిపించకుండా పోయిన అమె తల్లిదండ్రులలో అమె తండ్రి ఇవాళ బెంగుళూరులో శవమై కనిపించాడు. దీంతో అసలే దు:ఖంలో మునిగిన అమె కుటుంబం మరింత విషాదంలోకి నెట్టివేయబడింది. గత వారం రోజులుగా తన తల్లిదండ్రుల ఫోన్స కాల్స్ కూడా అందుబాటులో లేకుండా స్విచ్ఛాప్ లో వున్నాయని.. కీడు శంఖించిన అమె స్థానిక ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేసింది. ఈ క్రమంలో అనుమానస్పద స్థితిలో హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది.

బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా మొదటగా ఏకే రావు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలోనే బెంగుళూరు పోలీసులు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేయగా, తరువాత హత్యకేసుగా సెక్షన్లను మార్చారు. ఏకే రావు మృతిపై బెంగళూరు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏకే రావు శరీరంపై కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తన తండ్రి హత్యకేసులో ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానాలను గాయని హరిణి కూడా వ్యక్తం చేశారు. తన తండ్రి హత్యకేసులోని మిస్టరీని వెలికితీయాలని అమె పోలీసులను కోరారు.

ఏకే రావు సుజనా ఫౌండేషన్‌ సీఈఓగా, సుజనా గ్రూప్స్ లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ఏకే రావు ఫ్యామిలీతో నివాసముంటున్నారు. ఆయన మరణవరా్త నేపథ్యంలో తొలుత ఓ రియల్టర్ తన తండ్రిని ఐదు కోట్ల రూపాయల మేర మోసం చేశారని వార్తలు వినిపించాయి. అయితే అది భరించలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కోణంలో వార్తలు వినిపించినా.. చివరకు ఆయనది హత్యగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీంతో ఆ దిశగా ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నెల 8న ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు చివరిసారిగా ఈ నెల 19న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.  

23 న ఏకే రావు మృతి చెందినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బెంగుళూరులోనే మృతుడి అంతక్రియలు పూర్తి చేశారు. మృతుడి శరీరంపై కత్తిగాట్లు ఉండటంతో హత్య కోణంలో బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ఏకేరావును హతమార్చి మృతదేహాన్ని ట్రాక్‌పై పడేసి ఉండొచ్చిని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హరిణి కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియాల్సి ఉంది. హరిణి ఓ ఇండియన్‌ ప్లేబ్యాక్ సింగర్‌. ఆమె గాయని మాత్రమే కాదు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. తమిళం, తెలుగు, కన్నడ, మాళయాలం, హిందీ సినిమాల్లో చాలా పాటలు పాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles