Kangana Ranaut Summoned By Delhi Assembly Committee బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు

Delhi assembly summons kangana ranaut over khalistani terrorists post

Delhi Assembly summons Kangana Ranaut, Kangana Ranaut Summoned By Delhi Assembly, Punjab Farmers, Terrorists, Khalistani terrorists, Delhi sub urban areas, Farm Laws, Kangana Ranaut, Summon, Delhi Assembly, Punjab Farmers, Khalistani terrorists, Sikhs, Delhi Assembly summons, Instagram post, Delhi, Politics

Delhi Assembly's Committee on Peace and Harmony on Thursday summoned Bollywood actress Kangana Ranaut to depose before it on December 6 (at 12 noon) over her recent social media post in which she had labelled farmers protesting against Centre's three farm laws as "Khalistani terrorists".

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు

Posted: 11/25/2021 02:57 PM IST
Delhi assembly summons kangana ranaut over khalistani terrorists post

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రైతులు దీక్షలను అవహేళన చేస్తూ వారిని ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చిన నేపథ్యంలో నలుదిక్కుల నుంచి అమె విమర్శలను ఎదర్కోంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. నిత్యం వివాదాల్లో చిక్కుకోవడం వెన్నతో పెట్టిన విద్యగా మారిన ఆమెపై నిన్న ముంబైలో మరో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు నమోదు కావడంపై అమె తనదైన శైలిలో సెటైరికల్ గా స్పందించిన విషయం తెలిసిందే. మరో చోట మరో కేసు అయినా తనకు  ఇంటిపట్టునే వుండే మూడ్ ఉందని కంగనా తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో ఓ ఫోటోను ట్వీట్ చేసి.. దానిపై ఈ మేరకు కోట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఇవాళ అమె ఇటీవల సిక్కు రైతులు, పంజాబ్ రైతులు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ స‌మ‌న్లు జారీ చేసింది. సిక్కుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో కంగ‌నాకు ఆ నోటీసులు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘ‌వ చ‌ద్దా ప్యానెల్ ముందు డిసెంబ‌ర్ ఆరో తేదీన హాజ‌రుకావాలంటూ ఆదేశించారు. సిక్కుల‌ను కించ‌ప‌రిచే రీతిలో కంగ‌నౌ కామెంట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సోష‌ల్ మీడియా సిక్కుల‌పై అనుచిత రీతిలో వ్యాఖ్య‌లు చేసిన కంగ‌నాపై ముంబైలోనూ కేసును న‌మోదు చేశారు.

ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ధ‌ర్నాలు ఖ‌లిస్తానీ ఉద్య‌మంగా అభివ‌ర్ణిస్తూ కంగ‌నా ఆరోప‌ణ‌లు చేసింది. అయితే ఆమె కావాల‌నే ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. అంతేకాకుండా ఎక్కడ సిక్కు రైతులకు కాంగ్రెస్ చేరువ అవుతుందోనని కూడా అమెలో అందోళన రేకెత్తి.. వారిపై కూడా బురదజల్లే ప్రయత్నాన్ని చేసింది. సిక్కుల‌ను అణిచివేసింది ఒక్క ఇందిరా గాంధీ మాత్ర‌మే అని, మాజీ ప్ర‌ధాని ఇందిర దేశ విభ‌జ‌న చేయ‌కుండా సిక్కుల‌ను అడ్డుకున్న‌ట్లు కంగ‌నా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో తెలిపింది. కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేప‌డుతున్న ఢిల్లీ, హ‌ర్యానా, పంజాబ్ రైతుల తీరును కంగ‌నా త‌ప్పుప‌ట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles