Bombay HC commutes death penalty of 3 convicts to life శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Shakti mills gang rape bombay hc commutes death sentence to life for 3

Shakti mills gang rape case, Justice SS Jadhav, Justice PK Chavan, Sessions Court, Bombay High Court, photo journalist, Shakti mills area, Mumbai, life imprisonment. death sentence, Vijay Jadhav, Mohammed Kasim Bengali, Mohammed Salim Ansari, Maharashtra, Crime

The Bombay High Court commuted death sentence of three men convicted in the 2013 Shakti mills gang rape case to life imprisonment. The three men had been convicted of gang-raping a 23-year-old photo journalist in the Shakti mills area of Mumbai, and had been awarded death penalty by a Sessions Court on the ground they were repeat offenders. A Bench of Justices SS Jadhav and PK Chavan upheld the conviction by the Sessions Court but reduced the sentence to rigorous imprisonment for life.

శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Posted: 11/25/2021 04:52 PM IST
Shakti mills gang rape bombay hc commutes death sentence to life for 3

ముంబైలోని శ‌క్తి మిల్స్ ప్రాంతానికి ఫోటో షూట్ కోసం ఓ వ్య‌క్తితో క‌లిసి వెళ్లిన 22 ఏండ్ల ఫోటో జ‌ర్న‌లిస్ట్ పై 2013లో సామూహిక లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన కేసులో ముగ్గురు దోషుల‌కు ముంబైలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు విధించిన మరణశిక్ష విషయంలో ఇవాళ బాంబే హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అయితే కిందికోర్టు విధించిన మ‌ర‌ణ శిక్ష‌కు విధించేందుకు వీరు ఏ మాత్రం తక్కువ నేరం చేయాలేదని పేర్కోన్న బాంబే హైకోర్టు గురువారం వీరికి ఆమరణ జైలు శిక్షను విధించింది.

ప్ర‌జాగ్ర‌హం ఆధారంగా తీర్పును వెలువ‌రించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసిన బాంబే హైకోర్టు.. శ‌క్తి మిల్స్ సామూహిక లైంగిక దాడి కేసు స‌మాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని.. లైంగిక దాడి బాధితురాలు శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా తీవ్ర వేద‌న అనుభ‌వించింద‌ని, ఇది మాన‌వ హ‌క్కులపై దాడి అని కోర్టు పేర్కొంది. అయితే కేవ‌లం ప్ర‌జాగ్ర‌హం తీర్పు ను ప్ర‌భావితం చేయ‌రాద‌ని వ్యాఖ్యానించింది. కాగా అదే రోజున ఉదయం ఇదే నిందితులు మరో 19 ఏళ్ల యువతిపై కూడా అత్యాచారం చేశారన్న అభియోగాలు కూడా నమోదు కావడంతో వీరిని వరుస దారుణాలకు పాల్పడుతున్న నిందితులుగా పరిగణించిన ప్రిన్సిఫల్ సెషన్స్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది.

ఈ తీర్పును అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టు అనుమతిని కోరుతూ పిటీషన్ దాఖాలు చేసిన నేపథ్యంలో న్యాయస్థానం నిందితులకు విధించిన మరణశిక్షను అమరణ జీవితఖైదు శిక్షగా మార్చింది. అయితే వీరు మరణశిక్షకు తక్కువ నేరాన్ని చేయలదేని పేర్కోన న్యాయస్థానం ప్రజాగ్రహాన్ని పరిగణలోకి తీసుకుని శిక్షను విధించలేమని చెప్పింది. ఈ కేసులోని ముగ్గురు దోషులు.. త‌మ మిగిలిన జీవిత‌మంతా జైలులో గ‌డ‌పాల‌ని, ఈ క్ర‌మంలో వారికి పెరోల్ జారీ చేయ‌రాద‌ని వారికి యావ‌జ్జీవ ఖైదు విధించింది.

2013లో ఓ వ్య‌క్తితో క‌లిసి శ‌క్తి మిల్స్‌కు ఫోటో షూట్ కోసం యువ‌తి వెళ్ల‌గా అత‌డిని చెట్టుకు క‌ట్టేసిన అయిదుగురు నిందితులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. నిందితుల్లో ముగ్గురు మ‌రో సామూహిక లైంగిక దాడి కేసులోనూ దోషులుగా తేల‌డం గ‌మ‌నార్హం. బాధితురాలిపై విజ‌య్ జాద‌వ్‌, మ‌హ్మ‌ద్ ఖాసిం బెంగాలి, మ‌హ్మ‌ద్ స‌లీం అన్సారీ, సిరాజ్ రెహ్మీన్ ఖాన్‌, ఆకాష్‌లు ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరిలో ఆకాష్ నేరం జ‌రిగిన స‌మ‌యంలో మైన‌ర్ కాగా 2014 మార్చిలో జాద‌వ్‌, బెంగాలీ, అన్సారీల‌కు ముంబై సెష‌న్స్ కోర్టు మ‌ర‌ణ శిక్ష విధించింది. ఖాన్‌కు యావ‌జ్జీవ ఖైదు విధించిన కోర్టు జువైన‌ల్ జ‌స్టిస్ బోర్డు దోషిగా నిర్ధారించిన మీద‌ట ఆకాష్ ను దిద్దుబాటు కేంద్రానికి త‌ర‌లించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles