Tomato prices touch Rs 130 at Madanapalli yard ఠారెత్తిస్తున్న టమాటా.. పెట్రోల్ ధరను మించిన ధర..

Tomato is the new petrol as prices cross rs 120 mark in many cities across india

Tomato, Tomato price per kilogram, Tomato common man vegetable, Floods, Hyderabad, Price Hike, South India, tomato prices, Chennai, Bengaluru, Madanpalli, Hyderabad, Andhra Pradesh, Crime

Heavy rains and flash floods over the last week that majorly hurt the state of Andhra Pradesh, Tamil Nadu and Karnataka have damaged many crops, triggering a rise in vegetable prices across southern India. Thanks to a shortage, tomato prices surged at most markets across AP, reaching a whopping Rs 130 per kilogram at the Madanapalli market yard.

ఠారెత్తిస్తున్న టమాటా.. పెట్రోల్ ధరను మించిన ధర..

Posted: 11/23/2021 08:42 PM IST
Tomato is the new petrol as prices cross rs 120 mark in many cities across india

సామాన్యుడిని టమాట రేట్లు ఠారెత్తిస్తున్నాయి. వాటిని కొనాలంటేనే జనాలు జంకుతున్నారు. తాజా పరిస్థితులలో టామాటా ధరలు ఏకంగా పెట్రోల్ ధరలను మించిపోవడంతో.. దక్షిణ భారత దేశంలోని అనేక వంటిళ్లకు తాళం పడింది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అంటూనే.. కిలో టమాటాకు రూ. 130 పెట్టి తెచ్చుకుని తనిడం కన్నా.. ఏదో ఒక హోటల్ నుంచి బోజనం తెప్పించుకోవడం బెటర్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిత్యావసర సరుకులను నిత్యం అందుబాటు ధరల్లో వుంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పిన కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం మాత్రం చర్యలు ఉపక్రమించడం లేదు.

గత రెండు వారాలుగా టామాటా ధర సామాన్యులకు అందనంత దూరానికి ఎగబాకుతున్నా.. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో చాలా మంది వంటల్లో టమాట కోటాను తగ్గించేశారు. హోటళ్లలోనూ కోతలు పెట్టేస్తున్నారు. టమాట వెరైటీలకు ఎక్స్ ట్రా బిల్లులు వేస్తున్నారు. ఏపీలో కిలో టమాట గరిష్ఠంగా రూ.130 పలికింది. ఇవాళ ఉదయం నుంచి సగటున కిలో టమాట రూ.104కు అమ్ముడవుతోంది. టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు టమాట చట్నీకి రాంరాం చెప్పారు.

పావు కిలో టమాటలను కొనేబదులు.. అదే రేటుకు రెండు మూడు రకాల ఆకు కూరలు కొంటున్నారని వ్యాపారులు అంటున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం వరకు కిలో టమాట రూ.10 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. భారీ వర్షాలు పడడం, ట్రాన్స్ పోర్ట్ కు ఆటంకాలు ఏర్పడడం వంటి కారణాలతో టమాటల రాక తగ్గిపోయింది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. ఇటు వేరే కూరగాయల ధరలూ బాగా పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles