Amazon in legal net for online ganja sale ఆన్ లైన్లో అక్రమ దందా.. అమెజాన్ ద్వారా గంజాయి సరఫరా..

Amazon platform used for smuggling ganja online company responds

Amazon, Amazon India, Amazon Ganja Smuggling , ganja smuggling, Amazon Marijuana Smuggling, marijuana smuggling, Visakhapatnam, Andhra Pradesh, Crime

E-commerce major Amazon India on Monday said it is currently investigating an issue, wherein its platform was allegedly used to source marijuana (ganja). Online marijuana racket busted in Madhya Pradesh Currently investigating use of platform for sourcing marijuana, says

ఆన్ లైన్లో అక్రమ దందా.. అమెజాన్ ద్వారా గంజాయి సరఫరా..

Posted: 11/24/2021 10:50 AM IST
Amazon platform used for smuggling ganja online company responds

మనవాళ్లకు ఉన్న తెలివితేటలు అమోఘం. ఎంతటి క్లిష్టమైన కార్యానైనా అత్యంత సులువైన పద్దతిలో సాధించగలగడం మనవారికి అలావాటే. అయితే ఆ తెలివితేటలను సక్రమ పనులను వినియోగిస్తే మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. కానీ మనవాళ్లు వారికున్న తెలివితేటలను వక్రమార్గం పట్టించి కటకటాలపాలయ్యారు. ఏకంగా అన్ లైన్ కేంద్రంగా గంజాయి స్మ‌గ్లింగ్‌కు స‌రికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా ఆన్‌లైన్‌లో సేవ‌ల ద్వారా గంజాయి స్మ‌గ్లింగ్‌కు పాల్ప‌డుతున్నారు. అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

విశాఖ‌ప‌ట్ట‌ణం కేంద్రంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు గంజాయిని స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు నిర్ధారించారు. దీంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బెండీలో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కేసు విచార‌ణ నిమిత్తం మ‌ధ్య‌ప్ర‌దేశ్ పోలీసులు.. ఇవాళ విశాఖ‌కు చేరుకున్నారు. విశాఖ ఆన్‌లైన్ స్టోర్‌లోని ముగ్గురు ఉద్యోగులు కుమార‌స్వామి, కృష్ణంరాజు, వెంక‌ట‌ర‌మ‌ణ‌ను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి స‌ర‌ఫ‌రా చేసే శ్రీనివాస్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. క‌రివేపాకు పొడి, హెర్బ‌ల్ ప్రొడ‌క్ట్స్ పేరుతో గంజాయిని అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles