Man tries to enter Lion's enclosure in Hyderabad zoo సింహం ఎన్ క్లోజర్ లోకి దిగేందుకు ప్రయత్నించిన యువకుడు

Man tries to enter lion s enclosure in hyderabad zoo video goes viral

Hyderabad Zoo park, Nehru Zoological Park, G Sai Kumar, Moat area, Lion Enclosure, African Lion, Hyderabad, Crime

In a shocking incident, a 31-year-old tried to enter African Lion's enclosure in Hyderabad's Nehru Zoological Park and was saved by the staff. According to the reports, the person identified as G Sai Kumar was seen seated on the slope of a boulder of the moat area of Lion's enclosure. From the video, the lion was seen waiting down below for him.

ITEMVIDEOS: సింహం ఎన్ క్లోజర్ లోకి దిగేందుకు ప్రయత్నించిన యువకుడు

Posted: 11/23/2021 07:54 PM IST
Man tries to enter lion s enclosure in hyderabad zoo video goes viral

హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. కొన్ని సంవత్సరాల క్రితం అదే జూ పార్కులోని పులి ఎన్ క్లోజర్ లోకి వెళ్లిన ఓ వ్యక్తి దానికి ఆహారంగా మారిన విషాదఘటనను మర్చిపోకముందే మరో వ్యక్తి ఏకంగా అఫ్రికన్ సింహం ఉండే ఎన్ క్లోజరులో దూకేందుకు ప్రయత్నించి అందరినీ హడలెత్తించాడు. ఎన్ క్లోజరు పైభాగంలో ఉన్న గుహ వంటి నిర్మాణం మీదకు ఎక్కిన యువకుడు లోపలికి దిగేందుకు ప్రయత్నించాడు. తీరా సమాచారం అందుకున్న జూ సిబ్బంది పరుగుపరుగున వచ్చి యువకుడిని దిగకుండా అడ్డుకున్నారు.

అయితే అప్పటికే సదరు యువకుడిని గుహపై ఉండటాన్ని గమనించిన సింహం.. దూకుతాడా అని ఆశగా ఎదురుచూసింది. కొన్ని అడుగుల దూరంలోని సింహానికి ఆహారం కనిపించడంతో అది కాస్తా వెనక్కు వెళ్లి ఎగిరేందుకు కూడా ప్రయత్నించింది. అదే సమయంలో జూ పార్కు సిబ్బంది రావడంతో యువకుడి లేచి వెళ్లాడు. కాగా యువకుడు దిగేందుకు ప్రయత్నిస్తున్నంత సేపు దిగేస్తాడేమోనని అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆ సింహం కూడా కాసేపు అతడు దూకుతాడేమోనని అక్కడే కాపు కాసింది. కాసేపటి తర్వాత అది అవతలికి వెళ్లిపోయింది. అయితే ఎన్ క్లోజరు వెనుక నుంచి వచ్చిన జూ సిబ్బంది అతడిని అక్కడి నుంచి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ యువకుడి పేరు సాయికుమార్ అని గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles