SC nod for elevation of Saurabh Kirpal as Delhi HC judge సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సంచలన నిర్ణయం

Sc recommends elevation of saurabh kirpal as delhi hc judge

Saurabh Kirpal, Saurabh Kirpal Judge, LGBTQIA Rights, Queer Rights, Queer Community, Gay Rights, LGBTQIA+ People In Position Of Power, India Queer Rights

In a milestone for LGBTQIA+ rights in India, the Supreme Court collegium recommended the elevation of senior advocate Saurabh Kirpal as a judge in the Delhi High Court. The recommendation, finalised in a meeting on 11 November, comes after the collegium rejected his candidature four times since 2018 based on an alleged objection from the union government.

సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సంచలన నిర్ణయం

Posted: 11/16/2021 11:41 AM IST
Sc recommends elevation of saurabh kirpal as delhi hc judge

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ భారత సీజేఐగా పలు కీలక నిర్ణయాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక తాజాగా ఆయన సంచలన సిఫార్సు చేశారు. భారత దేశ చరిత్రలో తొలిసారి ఒక స్వలింగ సంపర్కుడినని న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేశారు. తాను స్వలింగ సంపర్కుడిని అంటూ గతంలో బహిరంగంగా ప్రకటించుకున్న సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్‌పాల్‌ను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజయం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడం సంచలనంగా మారింది.

కాగా, గతంలో 2017, 2018, 2019 జనవరి, ఏప్రిల్ నెలల్లో సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్ పాల్ పేరును కొలీజయం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆయన పేరును న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయలేదు. అయనకు పదవిని కట్టబెట్టే ముందు జరిగిన కేంద్ర నిఘావిభాగం ఎంక్వైరీలో ఆయనను స్వలింగ సంపర్కుడిగా ప్రస్తావించకుండా, ఆయన జీవిత భాగస్వామి విదేశానికి చెందిన వ్యక్తని, స్విస్ రాయబార కార్యాలయంలో పనిచేస్తుండడంతో ఆయన నియామకం దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఫలితంగా గత నాలుగేళ్లుగా సౌరభ్ సీనియర్ న్యాయవాదిగానే ఉండిపోయారు. తాజాగా, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆయనను హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేసింది. అయితే సౌరబ్ కిర్ పాల్ నియామకం పై కేంద్రం ఏ తీరుగా వ్యవహరిస్తోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి కనుక కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి స్వలింగ సంపర్క వ్యక్తిగా సౌరభ్ కిర్‌పాల్ రికార్డులకు ఎక్కుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles