Bus driver suffers heart attack yet saves passengers! డ్రైవర్ కు గుండెపోటు.. తుది నిమిషంలోనూ కర్తవ్య నిర్వహణ

Tsrtc bus driver suffers heart attack yet controls bus saving passengers

TSRTC Bus, Warangal Hyderabad Bus, RTC Bus Driver, Passengers on board, heart attack, Srinivas, Samesh, stoping the bus, Road side, Telangana, Crime

Passengers on the bus and passersby on the road were saved, thanks to a last-minute alert by the driver. According to TV9 media, an RTC driver travelling from Hyderabad to Warangal suffered a heart attack while on the road. Samesh, the bus driver, was able to stop the bus at one end of the road with much difficulty.

ITEMVIDEOS: ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు.. తుది నిమిషంలోనూ కర్తవ్య నిర్వహణ

Posted: 11/15/2021 06:43 PM IST
Tsrtc bus driver suffers heart attack yet controls bus saving passengers

తెలంగాణ ఆర్బీసీ బస్సు డ్రైవర్ తనకు అపాయం పొంచివున్న సమయంలోనూ తన కర్తవ్య నిర్వహణను మాత్రం మర్చిపోలేదు. దీంతో హైదరాబాద్ మహానగరంలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ తన ప్రాణాలు పోతున్న వేళ కూడా తన కర్తవ్యాన్ని మరువక.. తన అపార అనుబవం అందించిన సమయస్ఫూర్తితో బస్సును రోడ్డుకు పక్కన ఆపేసిన ఘటన ఇది. దీంతో ప్రమాదం సంభవించి పదుల సంఖ్యలో ప్రయాణికులతో పాటు రోడ్డుపై వెళ్తున్న తోటి వాహనదారులకు ముప్పు కలిగే అవకాశాలు వున్నా.. తన ప్రాణం కన్నా తన కర్తవ్యానికే ప్రాధాన్యమిచ్చిన డ్రైవర్ త్వరగా కోలుకోవాలని ప్రయాణికులు ప్రార్థిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళ్తున్న బస్సు అది. బస్సులో దాదాపుగా 15 నుంచి 18 మంది వున్నారు. వరంగల్ కు బయలుదేరిన బస్సు డ్రైవర్ శ్రీనివాస్ యధావిధిగా బస్సును నడుపుతూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇంకా నగరంలోని ట్రాఫిక్ లోనే ప్రయాణిస్తోంది. అయితే అకస్మాత్తుగా డ్రైవర్ శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చింది. హైదరాబాదులోని రద్దీ ట్రాఫిక్ నేపథ్యంలోనూ ఆయన తన అపార అనుభవాన్ని, సమయస్ఫూర్తిని వినియోగించి ఎవరికి నష్టం వాటిల్లకుండా బస్సును రోడ్డు పక్కన నిలిపాడు.

డ్రైవర్ పరిస్థితిని చూసిన కండక్టర్ సహా బస్సులోని ప్రయాణికులు వెంటనే 108కు ఫోన్ చేసి అంబులెన్సును అప్రమత్తం చేశారు. వివరాలు చెప్పడంతో అంబులెన్స్ శరవేగంగా చేరుకుంది. దీంతో సకాలంలో అసుపత్రికి తరలించడంతో డ్రైవర్ శ్రీనివాస్ అరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట్ కు చెందిన శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో వారు ఆయనను వెనువెంటనే ప్రైవేటు అసుపత్రి నుంచి తార్నాకాలోని ఆర్టీసీ అసుపత్రికి తరలించారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని అటు ప్రయాణికులు, ఇటు సహచర కార్మికులు కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles