UP agrees to appoint former HC judge to monitor Lakhimpur Kheri probe ‘లఖింపూర్‌’ ఘటనపై దర్యాప్తుకు.. అంగీకరించిన యూపీ సర్కారు

Up agrees to appoint former hc judge to monitor lakhimpur kheri probe

CJI, Justice NV Ramana, Supreme Court, Lakhimpur Kheri violence, Lakhimpur Farmers Killing, Uttar Pradesh, UP Farmer killing, UP Violence, Lakhimpur Farmers Killing, lakhimpur kheri violence case, lakhimpur kheri, farmers protest, ashish mishra, ajay mishra, Uttar pradesh, Crime

The Uttar Pradesh government on Monday agreed to the appointment of a former high court judge from outside the state to monitor the ongoing probe into the Lakhimpur Kheri incident, in which at least eight people were killed in October. The state government has now requested the top court to suggest a name of a judge to oversee the probe.

లఖింపూర్‌’ ఘటనపై దర్యాప్తుకు.. అంగీకరించిన యూపీ సర్కారు

Posted: 11/15/2021 05:50 PM IST
Up agrees to appoint former hc judge to monitor lakhimpur kheri probe

దేశంలో కలకలం రేపిన లఖీపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దెబ్బకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. ఈ కేసును సమోటోగా తీసుకుని విచారణను ప్రారంభించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేసింది. అక్టోబర్ 2న జరిగిన ఈ ఘటనపై గడిచిన కొన్ని వారాలలో ఐదవ పర్యాయం ఈ కేసును విచారించింది. కాగా సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంటో ఎట్టకేలకు దిగివచ్చిన ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం నిర్ణయానికి కట్టుబడేందుకు అంగీకరించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఇవాళ మరోమారు కేసును విచారణ జరపింది. లఖింపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో దర్యాప్తును ఉత్తర్ ప్రదేశ్ సర్కారు అంగీకరించింది. దీంతో ఈ కేసు దర్యాప్తుపై ఆదేశాలను బుధవారం జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. సిట్ బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారంలోగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు.

ధర్మాసనం హైకోర్టుకు చెందిన రిటైర్డ్‌ జడ్జిలలో ఎవరినైనా ఒక్కరిని ఈ కేసు విచారణ కోసం నియమించవచ్చని తెలిపారు. ఇంతకు ముందు సుప్రీం కోర్టు.. హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిటైర్డ్‌ న్యాయమూర్తులు రాకేశ్‌కుమార్‌ జైన్‌, రంజిత్‌ సింగ్‌ పేర్లను సిఫారసు చేసింది. కొంతమంది సీనియర్‌ పోలీస్‌ అధికారులను కూడా సిట్లో చేర్చాలని ఆదేశించింది. ఇంతకు ముందు జరిగిన విచారణలో ఘటనకు సంబంధించిన సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే హింసాకాండలో జర్నలిస్ట్‌ రమణ్ కశ్యప్‌, శ్యామ్‌ సుందర్‌ హత్య కేసు దర్యాప్తుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles