Man fakes his death to claim Rs 1 cr insurance బ్రాహ్మణ, బనియాలపై మురళీధర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు

Brahmins and baniyas are in my pocket row over bjp leader s remark

Muralidhar Rao sparks controversy, Muralidhar Rao on Brahmins, baniya, Muralidhar Rao on Kamal Nath, Muralidhar Rao on congress, Muralidhar Rao on sabka saath sabka vikas, P Muralidhar Rao, BJP National General secretary, Madhya Pradesh BJP Inchage, BJP, Congress, Brahmin Baniya, Kamal Nath, sabka saath sabka vikas, Madhya pradesh, Politics

BJP General Secretary P Muralidhar Rao, in-charge of Madhya Pradesh, came under attack from the Congress which sought an apology from the BJP leader, who later claimed the opposition party has "distorted" his statement. Mr Rao, came under attack from the Congress which sought an apology

‘‘బ్రాహ్మణులు, బనియాలు మా జేబుల్లోని వ్యక్తులు’’ అగ్గిరాజేసిన మురళీధర్ రావు

Posted: 11/09/2021 11:47 AM IST
Brahmins and baniyas are in my pocket row over bjp leader s remark

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పి.మురళీధర్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి అనునిత్యం అండగా నిలిచిన వారని తమ జేబులోని వ్యక్తులుగా కొనియాడుతూ వివాదానికి తెరతీశారు. తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దుమారం కావడంతో ఆయన వెనువెంటనే మెట్టుదిగివచ్చారు. అయితే తన వ్యాఖ్యలతో నోచ్చుకున్న కులాలకు క్షమాపణలు చెప్పకుండానే అపవాదు మొత్తానికి, ఎస్సీ, ఎస్టీల వెనుకబాటు తనానికి ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలకుల పాలనేకారణమని వివాదాన్ని పక్కదారి పట్టించారు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఆయన నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే అంశాన్ని వివరిస్తూ.. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనం కోసం తమ ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన తన చేతితో చోక్కా పైజేబును చూపుతూ.. బ్రాహ్మణులు, కింద జేబును చూపిస్తూ బనియాలు తమ జేబులోని వ్యక్తులని వ్యాఖ్యానించారు. ఈ సామాజిక వర్గాల నుంచి ఎక్కువమంది పార్టీ కార్యకర్తలుగా వుండడం వల్ల మీడియా కూడా బీజేపీని బ్రాహ్మణ, బనియాల పార్టీగా పిలుస్తుందని అన్నారు. అయితే, బీజేపీ అన్ని వర్గాల శ్రేయస్సును కోరుతుందని స్పష్టం చేశారు.

మరోపక్క, బ్రాహ్మణులు తమ జేబులో ఉన్నారన్న మురళీధర్ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనని అన్నారు. ఆ పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, బ్రాహ్మణులు, బనియాలను కించపరిచారని అన్నారు. పార్టీ కోసం అహర్షిషలు కష్టడపడిన వర్గాలను ఇలా తూలనాడటం.. అవమానించడం బీజేపికి అలవాటేనని విమర్శించారు. కాగా కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన మురళీధర్‌రావు తన వ్యాఖ్యలను ఆ పార్టీ వక్రీకరించిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికీ వెనుకబాటుకు గురికావడానికి వారి పాలనే కారణమని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles