జగతి పబ్లికేషన్స్ లో పైసా కూడా పెట్టుబడి పెట్టని జగన్.. ఏకంగా రూ.1200 కోట్ల రూపాయల లాభాన్ని అందుకున్నారని ఇదెలా సాధ్యమని సీబిఐ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. అయితే జగతి పబ్లికేషన్స్ లో పెట్టిన పెట్టుబడులన్నీ అక్రమ భూ కేటాయింపుల ద్వారా వచ్చిన ముడుపులేనని పేర్కోంది. ఇందుకు సంబంధించిన బలమైన సాక్షాధారాలు తమ వద్ద వున్నాయిని సీబిఐ తమ వాదనల సందర్భంగా న్యాయస్థానానికి తెలిపింది. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడుల కేసులో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హెటిరో సంస్థ, ఆ సంస్థ ఎండీ శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది సురేందర్ వాదనలు వినిపిస్తూ జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులన్నీ ముడుపులేనని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి, తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని ఉపయోగించుకున్నారని అక్రమ పెట్టుబడులకు తెరలేపారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి ప్రణాళిక ప్రకారం జగన్ ఈ విధంగా వ్యవహరించారని.. దీంతో అక్రమ అస్థుల కేసులో వీరిద్దరూ కుట్రదారులేనని పేర్కోన్నారు. హెటిరో, ఇతర కంపెనీలకు తండ్రి ద్వారా లబ్ధి చేకూర్చి, ఆపై వారిచ్చిన ముడుపును జగతిలోకి పెట్టుబడులుగా మళ్లించారని కోర్టుకు తెలిపారు.
ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించిందని, హెటిరో హెల్త్ కేర్ లో నిర్వహించిన తనిఖీల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు వెలుగు చూశాయని తెలిపారు. జగన్ సంస్థలో పెట్టుబడికి సంబంధించి హెటిరో ఎండీ శ్రీనివాసరెడ్డిది కీలకపాత్ర అని స్పష్టం చేశారు. లాభాన్ని ఆశించకుండా ఎవరూ పెట్టుబడులు పెట్టరని, కానీ ఇప్పటి వరకు పైసా కూడా లాభం రాని విషయాన్ని గుర్తించాలని కోరారు. అంతేకాదు, జగతి పబ్లికేషన్స్‌లో జగన్ రూ. 73 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టి 70 శాతం వాటాను సొంతం చేసుకున్నారని, కానీ రూ. 1173 కోట్లు పెట్టుబడి పెట్టిన సంస్థలకు మాత్రం 30 శాతం వాటా మాత్రమే దక్కిందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కాబట్టి పెట్టుబడుల విషయంలో నేరం జరిగిందని చెప్పడానికి తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, పూర్తిస్థాయి విచారణ కనుక మొదలైతే నేరాన్ని నిరూపిస్తామని సీబీఐ న్యాయవాది సురేందర్ పేర్కొన్నారు. హెటిరో సంస్థ జగన్ జగతిలో 2006, 2007లో రెండు విడతలుగా పెట్టుబడి పెట్టిందని, అదే సమయంలో ఆ సంస్థకు అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని పేర్కొన్నారు. 2008లో జగతిలో మరోమారు పెట్టుబడి పెట్టిన తర్వాత మరో 25 ఎకరాలను అప్పటి ప్రభుత్వం హెటిరోకు కేటాయించిందని అన్నారు. కాగా, హెటిరో డైరెక్టర్లందరూ నిందితులని తాము చెప్పడం లేదని సీబిఐ పేర్కొంది. కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more