Man fakes his death to claim Rs 1 cr insurance రూ.కోటి కొట్టేసేందుకు స్కెచ్.. అనుమానంతో అరెస్టు.!

Madhya pradesh man fakes his death to claim rs 1 cr insurance arrested

Rs 1 crore, insurance amount, Abdul Hanif, Dr Shakir Mansoori, fake death certificate, insurance company, Rehana, Kotwali police station, Dewas police, forgery, Madhya pradesh, Crime

A 46-year-old man here in Madhya Pradesh allegedly faked his death and used forged documents to claim an insurance of Rs one crore. The police arrested the accused, Abdul Hanif, and a doctor who had made a fake document of Hanif's death.

రూ.కోటి కొట్టేసేందుకు స్కెచ్.. అనుమానంతో అరెస్టు.!

Posted: 11/09/2021 10:56 AM IST
Madhya pradesh man fakes his death to claim rs 1 cr insurance arrested

కోటి రూపాయల భీమా సోమ్మును కోట్టేయాలని భావించిన ఓ వ్యక్తి స్కెచ్ బెడిసికోట్టింది. అతని భార్య, కొడుకు  వ్యవహార తీరుపై అనుమానం కలిగిన ఇన్సూరెన్స్ సంస్థ వారిపై పోలీసు విచారణకు పిర్యాదు చేసింది. దీంతో సదరు వ్యక్తి బతికుండే.. కోటి రూపాయలను కొట్టివేసేందుకు ప్రణాళిక రచించాడని తెలిసిన అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. అతనికి సాయపడిన ఓ వైద్యుడిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇక భీమా సోమ్ముకోసం సంస్థకు వెళ్లి ఆర్జి పెట్టిన అతిన భార్య, పిల్లాడిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు తప్పించుకు తిరుగుతున్న వారి కోసం అన్వేషణ సాగించారు.

మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా వున్నాయి. అబ్దుల్ హనీఫ్ (46) అనే వ్యక్తి తాను లేకపోయినా తన కుటుంబం మాత్రం ఆర్థికంగా ఎలాంటి ఒడిదొడుకులకు గురికాకుడదని రూ.కోటికి భీమా చేయించుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సెప్టెంబరు 2019లో ఓ బీమా కంపెనీలో కోటి రూపాయల విలువైన బీమా పాలసీ తీసుకున్నాడు. అయితే కరోనా కారణంగా తన అదాయం పూర్తిగా తగ్గింది. దీంతో అతడికి ఓ అలోచన వచ్చింది. తాను ప్రస్తుతం వున్న అర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు రూ.కోటి భీమా సోమ్మును పోందడం ఒక్కడే మార్గమని భావించారు.

అప్పటికే 2019, 2020 ఏళ్లకు చెందిన వాయిదాలు చెల్లించిన తర్వాత ఈ ఏడాది వాయిదా సోమ్మును కట్టలేక.. ఆ కోటి రూపాయల బీమాను కొట్టేయాలని భావించాడు. ఇందుకోసం వైద్యుడు షకీర్ మన్సూరితో కలిసి పన్నాగం పన్నాడు. తాను మరణించినట్టు మరణ ధ్రువీకరణ పత్రాలను రెడీ చేసుకున్నాడు. తర్వాత వాటిని బీమా కంపెనీకి సమర్పిస్తూ, హనీఫ్ భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్ పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారి వ్యవహారాన్ని అనుమానించిన సదరు బీమా సంస్థ దేవాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు వారిపై నిఘాను పెట్టారు. వారి నిఘాలో అబ్దుల్ హనీఫ్ బతికేవున్నాడని తెలింది. వారి బాగోతం బయటపడటంతో పోలీసులు వారిపై పోర్జరీ కింద కేసును నమదు చేశారు. కాగా ఈ కేసులో అబ్దుల్ హనీఫ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దొంగ డెత్ సర్టిపికేట్ ను జారీ చేసిన వైద్యుడు డాక్టర్ షకీర్ మన్సూరీని కూడా అరెస్టు చేశారు. ఇక ఆయనకు చెందిన డాక్టర్ ధృవపత్రంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసు వెలుగులోకి రావడంతో హనీఫ్ భార్య, కొడుకు ఇక్బాల్ అదృవ్యం కావడంతో వారి కోసం అన్వేషణ కోనసాగుతోందని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles