Uber Driver Wins Rs 75 Lakhs In Lottery ఉబర్ డ్రైవర్ వరించిన అమెరికా లాటరీ..

Uber driver wins rs 74 lakhs in lottery after buying ticket during break time

cab driver, passengers, lottery, uber driver, winner, bigger lottery, $1,000 loaded scratch-off ticket, $1,00,000 lottery, Joppa, Maryland state, USA

Being a cab driver is no easy thing. From odd hours to long journeys and having to deal with all kinds of passengers day in and day out, it is a tough job for anyone to do. To top it off, the pay is also not much and any break taken between rides means no money for that period of time.

అదృష్టవంతుడు.. ఉబర్ డ్రైవర్ వరించిన అమెరికా లాటరీ..

Posted: 10/28/2021 07:36 PM IST
Uber driver wins rs 74 lakhs in lottery after buying ticket during break time

లాటరీ తగలిందంటనే దశ తిరగడం అని అర్థం. అయితే ఓ పండంటి కాపురంలో చిచ్చుపెట్టిన దురదృష్టం ఎక్కడో ఒక్కటి తప్ప.. దాదాపుగా మిగిలిన అందరి జీవితాల్లో మాత్రం లాటరీ తగలడం అంటేనే వెలుగులు నింపడం అన్నది సహజం. ఇక ఇలాంటి అదృష్టం కాస్తో కూస్తో వస్తూనే వుంటే అది పెద్దగా మార్పులు తీసుకురాదు. కానీ పెద్ద మొత్తంలో కొట్టే లాటరీ వస్తే మాత్రం వారి దశ, దిశ తిరిగినట్టే. మరో విధంగా చెప్పాలంటే అదృష్టం భారీగా పడితే తప్ప పెద్ద మొత్తంలో జాక్ పాట్ లాంటి టికెట్లు తగలవు. ఎంత ఎక్కువ డబ్బు వస్తే అంత ఎక్కువ అదృష్టం ఉన్నట్లు.

చిన్నచితకా ఉద్యోగాలతో రోజంతా శ్రమించినా రూపాయి కూడా కూడబెట్టలేని కుటుంబాలు అనేకం. రోజువారి కష్టం చేసినా కుటుంబానికి రోజుకు రెండు పూటలా బోజనం పెట్టలేని జీతాలతో జీవితాలను ఈడుస్తున్న వారెందరో. ఇక ఇలాంటి వారికి లాటరీ తగలితే వారి ఆనందానికి అవధులు వుండవు. అలాంటి అనుభవం ఒక ఉబర్‌ డైవర్‌కి ఎదురైంది. వివరాల్లోకెళ్లితే...అమెరికాలోని 69 ఏళ్ల ఒక ఉబర్‌ డ్రైవర్‌ పగలు రాత్రి రైడింగ్‌తో నిర్విరామంగా పనిచేస్తుంటాడు. పెద్దగా ఆదాయం లేని విరామ సమయాన్ని ఈ ఉబర్‌ డ్రైవర్‌ మంచి లాభదాయకంగా మార్చుకున్నాడు.

ఇంతకీ అతను ఆ సమయంలో ఏం చేశాడంటే....జోప్పాలోని ఓ దుకాణం వద్ద 10 డాలర్లతో లాటరీ టిక్కెట్ ను కొనుగోలు చేస్తూ.. వాటి ద్వారా చిన్న చిన్నగా తగిలే ప్రైజ్ మనీ ద్వారా డబ్బలు గడిస్తుండేవాడు. అయితే తనకు అదృష్టం వుందని తాను కొన్న టికెట్లతో అతనికి అర్థమైయ్యింది. దీంతో అతను ప్రతి రోజు టికెట్ కోనడం అలవాటుగా కూడా మారింది. అయితే ఎంత సేపు తనకు చిన్న చితక రూపంలోనే ప్రైజ్ మనీ దక్కేది. ఇలా కాకుండా ఒక రోజు ఆయనకు అనుకోకుండా 1000 డాలర్ల ప్రైజ్ మనీ తగిలింది. దీంతో మరీ పెద్ద లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఆరోజు అనుహ్యంగా లక్ష (రూ.75 లక్షలు) గెలుచుకున్నాడు.

ఈ సందర్భంగా ఉబర్‌ డైవర్‌ మాట్లాడుతూ.. "ఈ రోజు చాలా పవిత్రమైంది అంటూ నేను అరుస్తుంటే పక్కనే ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి బాగానే ఉన్నావా అంటూ విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత నేను చూశావా నాకు లాటరీలో ఎంత తగిలిందో చూడు అంటూ ఆనందంగా చూపించాను. మిడిల్‌ రివర్‌ నుండి వచ్చిన నేను మేరీల్యాండ్ లాటరీ టికెట్‌ కంపెనీకి ఉబర్‌ డ్రైవర్‌గా ఐదేళ్లు నుంచి పనిచేయడమే కాక 24 వేల రైడ్లకు పైగా చేశాను" అని అన్నాడు. అంతేకాదు సదరు డ్రైవర్‌ ఈ డబ్బులో కొంతవరకూ  తన కారును బాగుచేయించుకోవడానికి ఖర్చు పెడతానని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles