17 cases of Delta variant AY.4.2 reported in India భారత్ లో మళ్లీ విజృంభన.? ఐదు రాష్ట్రాల్లో AY.4.2 వేరియంట్.!

Third wave in india 5 states report cases of new variant ay 4 2

coronavirus, coronavirus india, COVID-19 in India, COVID19, coronavirus, third wave in india, coronavirus third wave, COVID third wave, Third wave India, Maharashtra third wave, kerala third wave, lockdown in india, india lockdown, coronavirus news, coronavirus latest news, coronavirus update, coronavirus latest update, coronavirus cases in india, coronavirus deaths in india, coronavirus death toll, coronavirus death toll india, third wave of corona, worldometer coronavirus, worldometer coronavirus india, corona virus data, worldometers corona virus, 3rd wave of covid in india, covid 19 coronavirus cases delhi

Amid fear of COVID-19 third wave, the new AY.4.2 variant of coronavirus has reached Karnataka, Maharashtra, Andhra Pradesh, Kerala, Telangana and Jammu and Kashmir. The new variant is under investigation and according to experts the new variant is from the delta plus variant family of COVID-19.

కరోనా ధర్డ్ వేవ్: భారత్ లో మళ్లీ విజృంభన.? ఐదు రాష్ట్రాల్లో AY.4.2 వేరియంట్.!

Posted: 10/28/2021 08:23 PM IST
Third wave in india 5 states report cases of new variant ay 4 2

కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తొలిసారి ప్రజల భయాందోళన.. అప్రమత్తత కారణంగా తక్కువ సంఖ్యలో ప్రభావితం కాగా.. రెండో పర్యాయం మాత్రం దేశప్రజలను భయకంపితుల్ని చేసింది. వేగంగా వ్యాప్తిస్తూ.. కరోనా వైరస్ తొలిసారి కంటే రెట్టింపు వేగంతో విజృంభించి ఎంతోమందిని బలి తీసుకుంది. ఇక సెప్టెంబర్, అక్టోబర్ లలో మూడవ దశ ప్రభావం చూపుతుందన్న అంచనాలు మెళ్లిగా సన్నగిల్లి.. ప్రజలు నిర్లక్షంగా తిరుగుతున్న క్రమంలో మళ్లీ కరోనా మహమ్మారి కొత్త రూపంలో విజృంభించేందుకు సన్నధంగా వుంది. అందుకు కొత్తగా నమోదవుతున్న ఏవై 4.2 వేరియంట్ కేసులే నిదర్శనం.

కరోనా మహమ్మారి సాధారణ జలుబులా మారిందని.. ఇక దీంతో ఎలాంటి ఇబ్బంది లేదని పలు అధ్యయనాలు వెల్లడించిన తరుణంలో కరోనా ముప్పు సమసిపోలేదని, థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో పలు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఏవై.4.2  తీవ్ర భయాందోళనలు కలగజేస్తుంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌.. సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కుటుంబానికి చెందినది అని వైద్య నిపుణలు తెలిపారు.

దీని వల్ల కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం అధికంగా ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్‌ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్‌ గురించి పరిశోధించే పనిలో ఉన్నారు. ఇక ప్రస్తుతం మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో 16,156 కొత్త కేసులు నమోదు కాగా.. 733 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,60,989 యాక్టీవ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles