LPG price likely to increase before Diwali గృహలక్ష్ములపై గుదిబండ.. రూ.100 మేర పెరగనున్న గ్యాస్ ధర.!

Lpg price may be hiked next week petrol diesel rates up again

Liquid petroleum gas, LPG Cyclinder Rates, Liquefied petroleum gas, LPG, LPG price hike, petrol, diesel, Cooking gas, subsidised gas

LPG prices are likely to rise next week. Because the under recovery on the fuel widened to over Rs 100 per cylinder. Sources said the decision to increase the price of gas cylinders would depend on the government's permission. If the government allows the rate hike, it will be the fifth consecutive increase in gas cylinder rates.

గృహలక్ష్ములపై గుదిబండ.. రూ.100 మేర పెరగనున్న గ్యాస్ ధర.!

Posted: 10/28/2021 06:54 PM IST
Lpg price may be hiked next week petrol diesel rates up again

రోజూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ రేట్లతో నిత్యావసర ధరలు కూడా భగ్గుమంటున్నాయి. దీంతో పండుగల సంగతి అటుంచితే కనీసం రోజువారీ గ్యాస్ ఆదాను చేయడమెలా అన్న విసయాలపై దేశంలోని గృహలక్ష్ములు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే మరో పిడుగులాంటి వార్త వినబడింది. దీపావళిని పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వాలు కానుకలను అందజేస్తాయి. కానీ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మాత్రం 2016లో వారి స్ర్రీధనంగా వచ్చిన బంగారంపై కూడా లెక్కలు చెప్పాలని ఆంక్షలు పెట్టింది. ఇక తాజాగా 2021లో దీపావళిని పురస్కరించుకుని వారికి మరింత భారం కలిగించనుంది.

ప్రతీ పక్షం రోజులకో పర్యాయం అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగూణంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సబ్సీడీ (ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర)లపై హెచ్చతగ్గుల కోసం కేంద్రంతో పాటు ఇంధన సంస్థలు కూడా సమీక్ష నిర్వహిస్తుంటాయి. కాగా ఈ పర్యాయం మాత్రం సబ్సీడి వంట గ్యాస్ ధరలు భారీగా పెరుగనున్నట్టు సమాచారం. 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 వడ్డించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అనుమతి లభించిన తర్వాత.. ధరను ఎంతమేరకు పెంచాలన్న దానిపై నిర్ణయిస్తామని ఆ వర్గాలు వెల్లడించాయి. సిలిండర్‌ ధరను ఇంత మొత్తంలో పెంచడానికి గల కారణాలను ఆయిల్‌ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

గ్యాస్‌ ధరల్లో పెరుగుదలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లో రిటైల్‌ సిలిండర్‌ ధర పెంచేందుకు ఆయిల్‌ కంపెనీలను అనుమతించడం లేదు. దీంతో గ్యాస్‌ కొనుగోలు, అమ్మకం ధరల్లో అంతరం ఏర్పడింది. దీన్ని పూడ్చేందుకు అవసరమైన సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఇది చాలదన్నట్టు అంతర్జాతీయ విపణిలో గ్యాస్‌ ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. దీంతో నష్టాలను పూడ్చుకోవడానికి ఒక్కో సిలిండర్‌పై రూ.100 పెంచాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి.

‘ఎల్పీజీ అనేది ఇంకా నియంత్రిత వస్తువే. ప్రభుత్వం రిటైల్‌ సిలిండర్‌ ధరను క్రమబద్దీకరించవచ్చు కూడా. దీనికోసం ఆయిల్‌ కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీని చెల్లించాలి. అప్పుడే, తక్కువ రేటుకు ఎల్పీజీ సిలిండర్‌ను విక్రయించగలం’ అని ఒక అధికారి తెలిపారు. ‘అసలు ధర, రిటైల్‌ ధర మధ్య ఏర్పడిన అంతరాన్ని పూడ్చేందుకు అవసరమైన పరిహారం లేదా సబ్సిడీని ఇస్తామన్న హామీ.. ప్రభుత్వం నుంచి ఇంకా రాలేద’ని పేర్కొన్నారు. సిలిండర్‌పై సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోతే, కచ్చితంగా రిటైల్‌ సిలిండర్‌ ధరలను పెంచాల్సిందేనన్నారు.

గడిచిన మూడు నెలల్లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను నాలుగుసార్లు పెంచారు. జూలైలో ఒక్కో సిలిండర్‌పై రూ.25.50, ఆగస్టు 17న రూ.25, సెప్టెంబర్‌ 1న రూ. 25, అక్టోబర్‌ 6న రూ.15 పెంచారు. స్థూలంగా గడిచిన జూలై నుంచి సిలిండర్‌పై ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.90 పెంచింది. ప్రస్తుతం ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.952కు చేరింది. ఎల్పీజీపై సబ్సిడీని ఎత్తేస్తూ గతేడాది కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్‌ ధరలు ఒకేలా ఉంటున్నాయి.

* నరేంద్రమోడీ తొలిసారి అధికారంలోకి వచ్చిన జూన్‌, 2014లో సబ్సీడీ గ్యాస్ సిలిండర్‌ ధర-రూ.414
* రెండోసారి అధికారంలోకి వచ్చిన జూన్‌, 2019లో సబ్సీడి గ్యాస్ సిలిండర్‌ ధర-రూ.500
* ప్రస్తుతం సబ్సీడీ గ్యాస్ సిలిండర్‌ ధర- రూ. 952
* ఏడేండ్ల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలో పెరుగుదల- రూ.538

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles