Aryan Khan Gets Bail, to Walk Free on Friday బాంబే హైకోర్టులో అర్యన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు

Aryan khan gets bail after 3 weeks in jail to walk free on friday

Mumbai special court, Aryan Khan bail denied, Conspiracy angle, Aryan Khan advocates, Mumbai High Court, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, Showik Chakraborty, Rhea Chakraborty, aryan khan Arthur Road jail Jail food, Aryan khan bail plea reserved, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, sameer wankhede, ncb, Crime

The Bombay HC on Thursday granted bail to Aryan Khan, Arbaaz Merchant and Munmun Dhamecha in the drugs-on-cruise case. The court will pronounce its detailed order tomorrow, and the three accused will be out of prison either by tomorrow or Saturday. They will come of the jail after the order is released from the court.

ముంబై డ్రగ్స్ కేసు: బాంబే హైకోర్టులో అర్యన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు

Posted: 10/28/2021 05:30 PM IST
Aryan khan gets bail after 3 weeks in jail to walk free on friday

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో పట్టుబడిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై మూడు రోజులుగా కొనసాగిన విచారణ తరువాత భారీ ఉరటనిచ్చే విషయాన్ని వెల్లడించింది బాంబే హైకోర్టు. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ కు రెండు పర్యాయాలు దక్కని బెయిలు హైకోర్టులో మాత్రం భారీ ఊరట లభించింది. న్యాయస్థానం అర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు వారాల తర్వాత ఆయనకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం లభించింది.

ఈ నెల 3న ఎన్సీబి అధికారుల దాడిలో పట్టుబడిన 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్.. అప్పటి నుంచి వారి కస్టడీలో వున్నాడు. ఆ తరువాత 8 నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్డులోని కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా వున్నాడు. దీంతో గత ఇరవై ఐదు రోజుల కారాగారవాసానికి స్వస్తి పలకనున్న ఆయన ఇక బెయిలుపై విడుదల కానున్నాడు. జైలు అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న అర్యన్ ఖాన్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశాడని సమాచారం. జైల్లో ఉన్న ఆర్యన్ ను ఒకసారి ఆయన తల్లి గౌరీ ఖాన్, మరోసారి తండ్రి షారుఖ్ కలిశారు. ఈ రెండు సందర్భాల్లో ఆర్యన్ అందోళనగానే వున్నాడని సమాచారం.

ఇప్పటికే ఎన్సీబి ప్రత్యేక మెజిస్టేట్ కోర్టుతో పాటు సెషన్స్ కోర్టు కూడా అర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ తిరస్కరించాయి. ఈ క్రమంలో ముంబై హైకోర్టును ఆశ్రయించిన ఆర్యన్ ఖాన్ న్యాయవాదలు.. ఈ బెయిల్ పిటీషన్ దాఖలు చేయడానికి న్యాయకోవిదులైన మాజీ అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గీని రంగంలోకి దింపారు. తన వాదనల వినిపిస్తూ.. అర్యన్ ఖాన్ నుంచి ఎలాంటి మాదక ద్రవ్యాలను ఎన్సీబి అధికారులు స్వాధీనం చేసుకోలేదని.. అతడు డ్రగ్స్ తీసుకున్నాడని ఎలాంటి వైద్య పరీక్షల్లోనూ నిరూపితం కాలేదని అయినా.. తన క్లయింట్ ను ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఇక ఎన్సీబి అధికారులు సేకరించిన వాట్సాఫ్ చాట్ కూడా అర్యన్ ఖాన్ క్రూజ్ లోని రేవ్ పార్టీకి సంబంధించినది కాదని వాదనలు వినిపించారు. ఎన్సీబి కూడా అర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వరాదని హైకోర్టులో నివేదిక సమర్పించింది. ఆర్యన్ కు డ్రగ్స్ తీసుకునే అలావాటు ఉందని, అంతర్జాతీయ డ్రగ్ డీలర్స్ తో సంబంధాలు కూడా ఉన్నాయని, ఇక ఆయన పరపతితో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు కూడా వున్ానయని నివేదికలో పేర్కోంది. అయితే ఇరు తరుపు వాదనలను విన్న న్యాయస్థానం ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇదే కేసులో అక్టోబర్ 2న అరెస్టయిన ఇద్దరు నిందితులకు ఇదివరకే బెయిలు మంజూరు కావడంతో ఆర్యన్ ఖాన్ బెయిల్ కు మార్గం సుగమం అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles