ACP cites mental state for missing details in Disha encounter case దిశ కేసులో కాల్పలు జరపడానికి కారణాలివే: ఏసీపీ

Disha encounter case acp cites mental state for missing details in complaint

Disha Encounter case, ACP Surneder Reddy, Priyanka Reddy, Veternary doctor, Supreme Court, SC Commission, chairman V S Sirpurkar, Rekha Baldota, fact-finding inquiry, CI K Narasimha Reddy, SI Venkateshwarulu, Arif, Chennakeshavulu, Telangana, crime

Grilled over how details missing in his initial complaint — basis of FIR in alleged encounter — came to be included in his subsequent affidavit before the SC-appointed inquiry commission, Disha rape and murder case investigating officer (IO) ACP V Surender blamed it on his disturbed mental state after the killings. The ACP also defended police firing and said it was in self-defence.

దిశ కేసులో ఎన్ కౌంటర్ ఎందుకు జరపాల్సి వచ్చిందో చెప్పిన ఏసీపి సురేందర్

Posted: 10/26/2021 12:12 PM IST
Disha encounter case acp cites mental state for missing details in complaint

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన నిజనిర్థారణ కమీషన్ విచారణ కొనసాగుతోంది. ఈ సిర్పూర్కర్ కమిషన్ ఎదుట హాజరైన షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ రెడ్డి కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను కమీషన్ ఎదుట వెల్లడించారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న నిందితులపై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో వారికి తెలిపారు. ఇక ఎన్ కౌంటర్ తర్వాత తాను కొంత మానసిక ఒత్తిడికిగురయ్యానని, అందుచేత అందుకు సంబంధించిన వివరాలను తరువాతి రోజు నమోదు చేశానని తెలిపారు.

కమీషన్ ఎదుట హాజరైన ఏపీసీ సురేందర్ రెడ్డి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటున్న క్రమంలో కమీషన్ సభ్యురాలు రేఖా బాల్టోడా ఆయనకు ఇది కేవలం నిజనిర్థారణ విచారణ మాత్రమేనని.. మీరు ఎందుకు ఒత్తిడిని తీసుకుంటున్నారని.. అందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, ఈ కేసులో నిందితులు తమపై కాల్పులు జరుపుతారని తాము అసలు ఊహించలేదని అన్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు నిందితులు తమ ఆయుధాలు లాక్కుని, కళ్లలో మట్టి చల్లి కాల్పులు జరిపారని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు.

కాల్పులు జరపడానికి ముఖ్యకారణం తమ వెంట సాక్షులు, పంచులు కూడా వున్నారని, వారి సమక్షంలోనే సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తున్నామని.. వారి ప్రాణాకలు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని మాత్రమే తాము నిందితులు కాల్పులకు ప్రతిగా కాల్పులు జరిపామని చెప్పారు. ఈ ఘటన తర్వాత సురేందర్ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఎన్‌కౌంటర్ కేసు నమోదు చేసినప్పటికీ ఫిర్యాదులో కానీ, ఆ తర్వాత సమర్పించిన అఫిడవిట్‌లో కానీ నిందితులు మట్టి చల్లినట్టు కానీ, కాల్పులు జరిపినట్టు కానీ ఎక్కడా పేర్కోలేదు. ఇదే విషయాన్ని కమిషన్ ప్రశ్నించింది.

దీనికి సమాధానంగా ఏసీపీ సురేందర్ మాట్లాడుతూ.. ఎన్ కౌంటర్ తర్వాత తన మానసిక స్థితి బాగోలేదని, అందుకనే వివరాలను సరిగా నమోదు చేయలేకపోయానని చెప్పారు. అలాగే, చీకటిగా ఉండడంతో ముందు ఎవరు మట్టిచల్లారు? ఎవరి కళ్లలో మట్టి పడిందన్న విషయాలను గమనించలేకపోయానని వివరించారు.  అయితే, నిందితులను భయపెట్టేందుకే కాల్పులు జరపాలని సిబ్బందికి చెప్పానని తెలిపారు. తమ బృందంలోని లాల్‌మదార్ ముందుగా కాల్పులు జరిపారని, తమతోపాటు సాక్షులు కూడా ఉండడంతో వారిని రక్షించాల్సిన బాధ్యత కూడా తమపైనే ఉందన్నారు. కాబట్టే కాల్పులకు ఆదేశించినట్టు ఏసీపీ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles