AP Govt compensates cororna death patient families కోవిడ్ మృతులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటన

Ap govt compensates rs 50000 to covid dead patient familes

Corona virus, covid -19, deaths, compenstation, corona victim familes, medical and health department, divisional Revenue officers, Andhra Pradesh, crime

The government has issued instructions to the medical and health department to issue compensation of Rs 50,000 to the familes, who lost one of their family member due to coronavirus. Accordingly, all the Divisional Revenue officers are ordered to distribute the compensation amount to benificiaries.

కోవిడ్ మృతులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Posted: 10/26/2021 01:37 PM IST
Ap govt compensates rs 50000 to covid dead patient familes

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎందరెందరిపైనో ప్రభావం చూపింది. అందులో కొందరినీ కబళించి వేసింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్లు కూడా దాఖలైన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ క్రమంలో పరిమహారంగా ఎంత మొత్తాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో కరోనా మహమ్మారికి గురై ప్రభావంతో మరణించిన మృతుల కుటుంబాలు అటు కేంద్రంతో పాటు ఇటు సుప్రింకోర్టు వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే కరోనా మహమ్మారి కారణంగా మరణించిన మృతుల కుటుంబాలకు పరిహారం అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ కుటుంబం పూనుకుంది. ఇప్పటికే కరోనా తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను అందుకునేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు వేసి.. మృతుల కుటుంబాలన్నింటికీ పరిహారాన్ని అందించనుంది. రాష్ట్రంలో కరోనాతో మరణించిన మృతుల వివరాలన్నింటినీ సేకరించి.. వారందరి కుటుంబాలకు పరిహారాన్ని అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకు అదేశాలు జారీ చేశారు.

ఈ పరిహారం జారీలో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా జిల్లా రెవెన్యూ అధికారుల తగు చర్యలు తీసుకోవాలని అదేశించారు, పరిహారాలన్నీ డీఆర్వో అధికారుల సమక్షంలోనే జరగాలని సూచించారు. ఈ మేరకు కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లింపుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించింది. డీఆర్‌వో నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సుభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles