PhonePe starts charging users for paying mobile bills ఫోన్ ఫే కస్టమర్లకు షాక్.. ప్రాసెసింగ్ ఫీజు పేర కొత్త బాదుడు

Phonepe starts charging processing fees on phone recharges above rs 50

PhonePe, UPI transactions, mobile recharges, digital payments app, PhonePe processing fee, processing fee on UPI transactions, mobile recharges, digital payments app processing fees

Walmart's Group online payment application PhonePe has become the country's first such app that has started charging for mobile recharges. Digital payment app PhonePe has started charging processing fees in the range of ₹1 to ₹2 per transaction for mobile charges done for above ₹50.

ఫోన్ ఫే కస్టమర్లకు షాక్.. ప్రాసెసింగ్ ఫీజు పేర కొత్త బాదుడు

Posted: 10/23/2021 12:34 PM IST
Phonepe starts charging processing fees on phone recharges above rs 50

భారత్ దేశాన్ని డిజింటల్ ఇండియాగా మార్చేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ బంకులతో పాటు దాదాపుగా నగరాల్లోని బడ్డీ కొట్ల వరకు డిజిటల్ పే వ్యవస్థ చేరుకుంది. అయితే గ్రామీణ భారతం మాత్రం ఈ అంశంలో కాసింత వెనబడింది. ఓ వైపు నోట్ల రద్దు ఆ తరువాత కరోనా వైరస్ మహమ్మారి కూడా డిజిటల్ పేమంట్స్ పై నగరవాసులు అధికంగా దృష్టిసారించడానికి దోహదపడింది. అయితే గత కొన్నేళ్లుగా తమ సేవలను ఉచితంగానే అందుకున్న ప్రజలపై ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ యాప్ కూడా బాదుడుకు రెడీ అయ్యాయి.

కొత్తలో తమను వినియోగించే కస్టమర్లకు రాయితీలు, బహుమతులు అందించిన డిజిటల్ పేమెంట్స్ యాప్ లు తాజాగా డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరగగానే కస్టమర్లపై బాదుడుకు సిద్దమయ్యాయి. తమ వినియోగదారులకు ప్రాసెసింగ్ ఫీ పేరుతో వినియోగదారుల నుంచి రుసుము వసూలు చేసేందుకు డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే రెడీ అయింది. రూ. 50 పైన చేసే మొబైల్ రీచార్జ్‌లపై రూ. 1-2 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించడం మొదలుపెట్టిన తొలి సంస్థగా ఫోన్‌పే రికార్డులకు ఎక్కనుంది.

50 రూపాయల లోపు చేసే రీచార్జ్‌లు మాత్రం పూర్తిగా ఉచితమని, ఆపై 100 రూపాయల వరకు రూపాయి, అది దాటితే రూ. 2 వసూలు చేస్తామని ఫోన్‌పే తెలిపింది. గత నెలలో ఏకంగా 165 కోట్ల యూపీఐ లావాదేవీలు నిర్వహించింది. కాగా, ఇతర డిజిటల్ చెల్లింపు యాప్‌లు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై మాత్రం ఫోన్‌పేతోపాటు ఇతర యాప్‌లు కూడా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PhonePe  UPI transactions  mobile recharges  digital payments app  processing charges  Economy  

Other Articles