Ananya Pandey to Appear Before NCB on Monday ‘‘సోమవారం విచారణకు రండి..’’ అనన్యా పాండేకు ఎన్సీబి నోటీసులు

Ananya panday denies helping aryan khan get drugs to be questioned again

Shah Rukh Khan, Aryan Khan, Arthur Raod Jail, Mulakaat, bail denied, Mumbai High Court, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, shah rukh khan meet his son aryan khan, shah rukh khan aryan khan, Arthur Road jail Jail food, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, Crime

Actor Ananya Panday, questioned on two days by the Narcotics Control Bureau (NCB) in the drugs-on-cruise case, has denied using drugs or helping Aryan Khan source them. The 22-year-old Bollywood star was summoned reportedly on the basis of two-year-old WhatsApp chats found on the phone of Aryan Khan, details of which have been leaked by the anti-drugs agency.

‘‘సోమవారం విచారణకు రండి..’’ అనన్యా పాండేకు మళ్లీ ఎన్సీబి నోటీసులు..

Posted: 10/23/2021 08:40 PM IST
Ananya panday denies helping aryan khan get drugs to be questioned again

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని అభియోగాలపై అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ తో రెండేళ్ల నుంచి జరిగిన వాట్సాఫ్ చాట్ ఆధారంగా బాలీవుడ్ నటుడు చుంకీ పాండే తనయ వర్తమాన నటి అనన్య పాండేను కూడా ఎన్సీబి అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. కాగా రెండో రోజున అమె ఉదయం పదకొండు గంటలకు బదులుగా మధ్యాహ్నం రెండు గంటలకు రావడంతో అమెకు ఎన్సీబి అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారన్న విషయం తెలిసిందే.

కాగా అర్యన్ ఖాన్ తో జరిగిన చాట్ సంభాషణలో ఒక రోజు పార్టీకి అమెను కూడా రమ్మని అర్యన్ ఖాన్ అహ్వానించారు. అంతేకాదు.. పార్టీకి వస్తూ గంజాయిని కూడా తీసుకురావాలని కోరాడు. దీంతో దానికి అమె సరేనని.. తాను తీసుకువస్తానని చెప్పినట్టుగా చాట్ సంబాషణ సాగింది. దీంతో అర్యన్ ఖాన్ కు గంజాయిని అందించింది అనన్య పాండేనేనా అన్న కోణంలో ఇవాళ విచారణ సాగనుంది. ఈ క్రమంలో అనన్య తాను అర్యన్ ఖాన్ తో కేవలం జోక్ చేశానని చెప్పుకోచ్చింది. ఇక దీనిపై స్పందించిన ఎన్సీబి అధికారులు అనన్య గంజాయి సమకూర్చిందని ఆధారాలు లేవని తెలిపారు.

అయితే వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ కాల్ సంబాషణలను మరింత లోతుగా అధ్యయనం చేసిన ఎన్సీబి మరోమారు అనన్య పాండేకు నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూన్నట్లు ఆ నోటీసులలో పేర్కోంది. అమె నుంచి మరిన్ని నిజాలను రాబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి రోజున గంట పాటు విచారణకు హాజరైన అమె కేవలం ఏడుస్తూనే ఉండిపోయిందని.. ఇక రెండో రోజున నాలుగు గంటల విచారణలోనూ అమె స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని.. దీంతోనే అమెను మరోమారు ఎన్సీబి అధికారులు విచారించనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles