Priyanka Picks Up Broom Again After Yogi Adityanath's Dig మళ్లీ చీపురు పట్టిన ప్రియాంకా.. యోగీకి స్ట్రాంగ్ కౌంటర్

Priyanka gandhi vadra picks up broom again after yogi adityanath s dig

priyanaka cleans valmiki mandi, priyanka gandhi cleans maharshi valmiki temple, Lakhimpur kheri, Priyanka Gandhi, Congress, broom stick, Maharshi Valmiki Temple, Yogi Adithyanath, priyanaka gandhi PAC guest house, priyanaka gandhi room cleaning video, priyanaka gandhi brooming video, viral video, priyanaka gandhi viral video, Lakhimpur kheri protest, Congress, farmer protest updates, accident, farmer death, Uttar Pradesh, Crime

Congress leader Priyanka Gandhi Vadra paid a surprise visit to a Dalit locality in Lucknow and picked up a broom, reacting to Chief Minister Yogi Adityanath's dig at her for sweeping the floor at the Sitapur guest house where she was detained.

ITEMVIDEOS: మళ్లీ చీపురు పట్టిన ప్రియాంకా.. యోగీకి స్ట్రాంగ్ కౌంటర్

Posted: 10/09/2021 05:41 PM IST
Priyanka gandhi vadra picks up broom again after yogi adityanath s dig

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల దారుణ మారణకాండను నిరసిస్తూ.. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జాతీయ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకుని సీతాపూర్ పీఏసీ గెస్ట్ హౌజ్ లో నిర్భంధించగా.. అపరిశుభ్ర గదిని అమె చీపురు పట్టి శుభ్రంచేశారు. తాజాగా ఆమెమరోమారు అమె చీపురు పట్టారు. మొదటిసారి కాకతాళీయంగా జరిగినా.. రెండవ సారి మాత్రం అమె బీజేపి ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకే చేశారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ దళిత వాడను అకస్మికంగా సందర్శించిన ప్రియంకా.. మరోమారు అక్కడ చీపురు చేతపట్టి ఆ దళితవాడను శుభ్రం చేశారు. అమెకు దళిత వాడలోని స్థానిక మహిళలతో పాటు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కూడా జత కలిశారు. అమె మొదటిసారి గదిని శుభ్రం చేయడంపై ముఖ్యమంత్రి యోగి.. స్పందిస్తూ చేసిన జాతి అహంకార వ్యాఖ్యలపై భగ్గుమన్న అమె.. సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చీపురు పట్టడం ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆలోచనా విధానాన్ని సీఎం యోగి మార్చుకోవాలని సూచించారు.

ప్రియాంక గాంధీ గదిని శుభ్రం చేయడంపై ‘దీని కోసం మాత్రమే వారు ఫిట్‌గా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అందుకే వారి స్థాయిని తగ్గించారు. వ్యతిరేకతను వ్యాప్తి చేయడం తప్ప వీరికి వేరే పని లేదు’ అని సీఎం యోగి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ లక్నోలోని దళిత ప్రాంతమైన లవ్ కుష్ నగర్‌ను సందర్శించారు. స్థానికులతో మాట్లాడిన తర్వాత చీపురు పట్టి అక్కడి మహర్షి వాల్మీకి ఆలయంలో శుభ్రం చేశారు. ‘దేశంలోని కోట్లాది మంది మహిళలు, పారిశుధ్య కార్మికులు శుభ్ర పరిచేందుకు ప్రతి రోజూ చీపురులను ఉపయోగిస్తారు. ఇది వారి సరళత, ఆత్మగౌరవానికి చిహ్నం’ అని అన్నారు.

సీఎం యోగి తన వ్యాఖ్యల ద్వారా తనను మాత్రమే అవమానించలేదని, ఈ పని చేసే కోట్లాది మంది దళిత సోదరులు, సోదరీమణులు, పారిశుధ్య కార్మికులను ఆయన అవమానించారని ప్రియాంక గాంధీ విమర్శించారు. దీంతో వీరితోపాటు కలిసి శుభ్రపరిచేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. చీపురును ఉపయోగించడం, శుభ్రపరచడం ఆత్మగౌరవ చర్య అని యోగిజీకి తెలియజేశానంటూ ఘాటుగా స్పందించారు. సీఎం యోగి దళిత వ్యతిరేకి అంటూ అరోపించిన అమె.. యోగీ కులతత్వ ప్రకటన చేయడం ద్వారా తన దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని కనబర్చారని అమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles