NCP's Nawab Malik akes allegations against NCB ఎన్సీబిపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన అరోపణలు

Bjp leader s brother in law released by ncb in cruise raid nawab malik

Nawab Malik, Narcotics Control Bureau (NCB), Aryan khan, BJP Leader Relative, Rishabh Sachdev, Mohit Kamboj, mumbai cruise drugs case, Sameer wankhede, aryan khan Arthur Road jail Jail food, Aryan khan bail plea rejected, NCB court, mumbai cruise drugs case, cordelia drugs case, Shah Rukh Khan, Arbaaz Khan, Munmun Dhamecha, Gauri Khan, sameer wankhede, ncb, Crime

Nationalist Congress Party leader and Minister Nawab Malik alleged that BJP leader Mohit Kamboj's brother-in-law Rishabh Sachdev was caught and let off by the Narcotics Control Bureau (NCB) during the Mumbai cruise raid. Nawab Malik made sensational allegation against the NCB when he claimed that the agency had also detained Rishabh Sachdev, brother-in-law of a relative of BJP leader Mohit Kamboj during the raid but let him go.

ముంబై డ్రగ్స్ కేసు: ఎన్సీబి అధికారిపై మహారాష్ట్ర మంత్రి సంచలన అరోపణలు

Posted: 10/09/2021 04:58 PM IST
Bjp leader s brother in law released by ncb in cruise raid nawab malik

ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్ లో జ‌రిగిన రేవ్ పార్టీపై బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు అర్యన్ ఖాన్ సహా ఎనమిది మందిని అదుపులోకి తీసుకన్న ఎన్సీబీ అధికారులుపై సంచలన ఆరోపణలు సంధించారు మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత న‌వాబ్ మాలిక్ ఆరోపించారు. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేసిన దాడులు ముంద‌స్తు ప్రణాళికలో భాగంగానే జరిగాయని ఆయన అరోపించారు. ఈ దాడులలో బీజేపి నేతల సమీప బంధవులు కూడా ఉన్నారని అయితే వారిని ఎన్సీబి అధికారులు వదిలేశారని ఆయన అరోపించారు.

ఈ మొత్తం వ్యవహరానికి నేతృత్వం వహించిన ఎన్సీబి ముంబై జోనల్ అధికారి సమీర్ వాంఖేడే దాడులు జరిగిన సందర్భంలో మొత్తంగా 8 నుంచి 10 మంది వరకు అదుపులోకి తీసుకున్నామని చెప్పారని, ఒక బాధ్యతాయుతమైన అధికారిగా వుంటూ ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారన్న సరైన సంఖ్యను ఎందుకు చెప్పలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అయితే ఎన్సీబి అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా దాడుల్లో పాల్గోన్నారని ఆయన తెలిపారు. మొత్తం 11 మందిని ఎన్సీబి అధికారులు అదుపులోకి తీసుకున్నారని అయితే.. అందులో ముగ్గురు నిందితులను ఎందుకు న్యాయస్థానంలో ప్రవేశపెట్టలేదని ఆయన నిలదీశారు.

పట్టుబడ్డ వారిలో మహారాష్ట్రాకు చెందిన ఓ బడా బీజేపి నాయకుడి బావమరిది కూడా వున్నాడని నిన్నఅరోపణలు చేసిన ఆయన.. ఇవాళ బీజేపి రాష్ట్ర స్థాయి నేత మోహిత్ కంబోజ్ బావమరిది రిషబ్ సచ్ దేవ్ కూడా వున్నాడని పేర్లను వెల్లడించారు. రిషబ్ సచ్ దేవ్ తో పాటు మరో ఇద్దరు బీజేపి నేతల సంతానం కూడా ఇందులో వున్నారని అయితే వారిని ఎందుకు తప్పించారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీ నేత‌లు, ఎన్సీబీ అధికారి స‌మీర్ వాంఖ‌డే మ‌ధ్య సంప్ర‌దింపులు జ‌రిగి ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు.

రేవ్ పార్టీలో 11 మందిని అరెస్ట్ చేయ‌గా క్రూయిజ్ షిప్‌పై దాడుల అనంత‌రం స‌మీర్ వాంఖ‌డే 8 నుంచి 10 మందిని అదుపులోకి తీసుకున్నామ‌ని ఎలా చెప్పార‌ని మాలిక్ గుర్తుచేశారు. ఆపై రిష‌బ్ స‌చ్‌దేవ‌, ప్ర‌తీక్ గాబా, అమీర్ ఫ‌ర్నిచ్‌వాలా అనే ముగ్గురిని విడుద‌ల చేశారని అన్నారు. క్రూయిజ్ షిప్‌పై దాడుల్లో 11 మంది ప‌ట్టుబ‌డితే ఎవ‌రి ఆదేశాలపై ముగ్గురు నిందితుల‌ను వ‌దిలివేశారో చెప్పాల‌ని ఎన్సీబీని తాము డిమాండ్ చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ అంశంపై ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్‌ చే స్వ‌తంత్ర ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని కోరుతూ తాను సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేకు లేఖ రాస్తాన‌ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles