Maharashtra: Woman gang-raped on board ఎక్స్ ప్రెస్ రైళ్లో యువతిపై దోపిడి దొంగల గ్యాంగ్ రేప్..

8 robbers accused of gangraping woman onboard train headed to mumbai

Lucknow-Mumbai Pushpak Express train, Rape, Maharashtra gang rape, Maharashtra train rape, Pushpak Express train rape, Mumbai police, Gang rape, Lucknow-Mumbai train, Pushpak Express train, 8 member Dacoits gang, woman, Mumbai news, Maharashtra news, crime

A 20-year-old woman was allegedly raped by some robbers on board the Lucknow-Mumbai Pushpak Express train between Igatpuri and Kasara railway stations in Maharashtra on the Central Railway route, a police official said on Saturday.

ముంబై-లక్నో పుష్పక్ ఎక్స్ ప్రెస్ రైళ్లో యువతిపై గ్యాంగ్ రేప్..

Posted: 10/09/2021 03:57 PM IST
8 robbers accused of gangraping woman onboard train headed to mumbai

రైలు ప్ర‌యాణం సురక్షితం అని ఎందరెందరో ప్రయాణాలు సాగిస్తుంటారు. కానీ అంత సురక్షితమైనది కాదని మరోమారు నిరూపితమైంది. గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాత్రి ప్రయాణాల్లో జీఆర్సీ పోలీసులను నియమిస్తున్నా.. పుష్పక్ రైలుతో ఓ మహిళపై అఘాయిత్యం చోటుచేసుకుంది. ఓ మహిళపై దోపిడీ దొంగ‌లు సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న ల‌క్నో – ముంబై పుష్ప‌క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఇగత్ పురి.. కాసర రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది.

స్లీప‌ర్ కోచ్ లో ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ‌పై ఎనిమిది మంది దోపిడీ దొంగ‌లు క‌త్తుల‌తో బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ముంబై సెంట్రల్ రైల్వే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మహిళపై అఘాయిత్యానికి తెగబడిన దొంగలు అంత‌టితో ఆగ‌కుండా ఆదే బోగిలో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికుల నుంచి న‌గ‌దు, ఆభ‌ర‌ణాల‌ను అప‌హ‌రించారు. దొంగ‌ల దాడిలో ఐదారు మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు గురై గ‌ట్టిగా అర‌వ‌డంతో రైలును ముంబైలోని కాస‌రా స్టేష‌న్ వ‌ద్ద ఆపేశారు.

అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆ కోచ్ వ‌ద్ద‌కు చేరుకుని ఇద్ద‌రు దొంగ‌ల‌ను అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రిని వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో న‌లుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగ‌ల నుంచి రూ. 34 వేల న‌గ‌దు, ఇత‌ర వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా ముంబై జీఆర్పీ పోలీసు కమీషనర్ ఖైసర్ ఖలీద్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఈ మార్గంలోని ఘాటు ప్రాంతంలో రైలు ప్రయాణిస్తుండగా దారుణం జరిగిందని తెలిపారు.

ఘటనపై మరింత సమాచారాన్ని ఆయన తన సోషల్ మీడియా మాద్యమం ద్వారా పోస్టు చేశారు. దోపిడి దొంగలు లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్ ప్రెస్ రైలును ఇగత్ పూరిలో ఎక్కారని, కాగా ఘాట్ ప్రాంతంలో రైలు ప్రయాణిస్తుండగా, దారుణానికి ఒడిగట్టారని తెలిపారు. కాగా రైలు కసరకు చేరుకోగానే ప్రయాణికులు సహాయం కోసం అరిచారని దీంతో అప్రమత్తమైన పోలీసులు దొంగల ముఠాలోని నలుగురిని పట్టుకున్నారని ఖలీద్ ట్వీట్‌లో తెలిపారు. కాగా ప్రయాణికుల నుంచి దోచుకున్న 96,390 విలువైన ఆభరణాలను దొంగలు దోచుకున్నారని, అయితే పట్టుబడ్డ నలుగురు నిందితులను నుంచి 34,200 సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఆయన మరో ట్వీట్ లో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles