Shiva Ganga Theatre drowned in flood water వరద నీటిలో మునకేసిన శివగంగ థియేటర్.. వీడియో వైరల్..

Shiva ganga theatre drowned in flood water collapesed wall damages 50 vehicles

Hyderabad rains, Shiva Ganga Theatre, silver screen drowned in hyderbad, theatre seats drowned, shiva ganga theatre rain fall, screening GHMC, Stong winds, Thunder and Lighting, rains lash Medchal, rains lash Rangareddy, rains in Sangareddy, Heavy rainfall in Hyderabad district, Telangana, Crime

Asian Shiva Ganga Theatre at Gaddiannaram in Dilsukhnagar was flooded with rainwater which led to the collapse of a compound wall. Almost 50 parked vehicles were damaged in the mishap. More rains are expected to lash Hyderabad and surrounding areas on Saturday

ITEMVIDEOS: వరద నీటిలో మునకేసిన శివగంగ థియేటర్.. వీడియో వైరల్..

Posted: 10/09/2021 02:59 PM IST
Shiva ganga theatre drowned in flood water collapesed wall damages 50 vehicles

తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు అంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణపై వరుణుడు పగబట్టినట్టుగా కుండపోత వర్షాలను కురిపిస్తున్నాడు. నైరుతి పవనాల ప్రభావం తిరుగు పయనం అయినా.. తెలంగాణను మాత్రం వరుణుడు వదల్లేదు. జూన్ నుంచి కురిపిస్తున్న వర్షాలతో జూలై నాటికే రాష్ట్రంలోని జలాశయాలన్ని నిండుకుండలను తలపించాయి. ఇక అప్పటి నుంచి కురుస్తున్న వర్సం లోతట్టు ప్రాంతాలను జలమయం చేస్తోంది. జూన్ నుంచి ప్రతీ వారం నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే వున్నాయి.

తాజాగా నిన్న రాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అనేకప్రాంతాల్లోకి వరద నీరు నిండుకోవడంతో జనజీవనం ప్రజలు  ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీలు పూర్తిగా వరద నీటిలోనే ఉన్నాయి. ముఖ్యంగా దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలోని చాలా కాలనీల్లోకి వరద నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. నగరంలోని రోడ్డు జలాశయాలను తలపించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలను ఎదుర్కోన్నారు.
అటు సరూర్ నగర్ ప్రాంతంలోని గడ్డిఅన్నారంలోగల శివ గంగ థియేటర్‌ను వరద నీరు ముంచెత్తింది. భారీ వరద నీరు చేరడంతో ఏషియన్ శివ గంగా థియేటర్ పూర్తిగా వరద నీటలో మునిగింది. ధియేటర్ ప్రహరీ గోడ కూలండంతో నీరు ఏకంగా ధియేటర్ లోనికి చేరింది. ధియేటర్ లోని వెండితెరతో పాటు కుర్చీలపై నుంచి వరద నీరుఉదృతంగా ప్రవహించింది. థియేటర్‌లో నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అది శివగంగ ధియేటర్ లోని దృశ్యాలేనా లేక మార్పింగ్ వీడియోలా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.


కాగా ధియేటర్ కు సంబంధించిన మరో వీడియో కూడా నెట్టింట్లో వైరల్ కావడతో అది శివగంగ థియేటర్ లోని దృశ్యాలని నెటిజనులు నిర్థారించుకున్నారు. ఇక ప్రహరీ గోడ కూలిన ఘటనలో.. అక్కడే పార్కు చేసిన దాదాపు 50 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాలపైనే ప్రహరీ గోడ కూలడంతో ఈ నష్టం వాటిల్లింది. వాహనాలు ప్రహరీ గోఢ శిధిలాల కింద కూరుకుపోవడంతో భారీ వర్షంలో ఇళ్లకు వెళ్లేందుకు ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా తమ వాహనాల డ్యామేజీకి థియేటర్ యజమాన్యమే బాధ్యత వహించాలని వాహనాల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles