BHEL Developed Ash Coal To Methanol Technology గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకత దిశగా.. భెల్‌ సంస్థ

Bhel successfully demonstrates india s first indigenous high ash coal gasification plant

Bharat Heavy Electricals Limited (BHEL), BHEL, DST, clean energy, NITI aayog, menthol, Department of Science and Technology, convert high ash coal to methanol, methanol fuel, niti aayog, methanol, hydrogen production, hydrogen mission, clean energy, bhel

Bharat Heavy Electricals Limited (BHEL) R&D centre at Hyderabad began the operations on India high ash coal gasification in 2016 to derive 0.25-ton methanol per day. With four years of rigorous efforts, BHEL successfully demonstrated a facility to create 0.25 TPD Methanol from high ash Indian coal using a 1.2 TPD Fluidized bed gasifier.

గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకత దిశగా.. భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ

Posted: 09/18/2021 04:14 PM IST
Bhel successfully demonstrates india s first indigenous high ash coal gasification plant

భారత్‌ భారీ విద్యుత్ పరికరాల సంస్థ (బిహెచ్ఇఎల్) మరో అరుదైన ఘనత దిశగా అడుగులు వేస్తోంది. యావత్ దేశం కాలుష్యరహితం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో భెల్ సంస్థ కూడా దేశ అవసరాలకు తగ్గట్టుగా గ్రీన్‌ ఎనర్జీ విభాగంలో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీని సాయంతో దేశంలో విద్యుత్ ఉత్పాదనకు మరో కొత్తమార్గం లభించినట్లు అయ్యింది. ఇక ఈ తరహా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన తొలి పైలట్‌ ప్రాజెక్టును హైదరాబాద్లో ఇటీవల ప్రారంభించింది బిహెచ్ఇఎల్. కర్బన ఉద్ఘారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక విధాలైన టెక్నాలజీలు వస్తున్నాయి.

అందులో భాగంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలుష్యంతో ఎక్కువ శక్తిని ఇచ్చే ఇంధనాన్ని తయారు చేసే టెక్నాలజీని భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ అభివృద్ధి చేసింది. అందులో భాగంగా బొగ్గు నుంచి మిథనాల్‌ ఉత్పత్తి చేసే ప్లాంటుని పైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో భెల్‌ ప్రారంభించింది. దేశంలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నా అందులో యాష్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం సమస్యగా మారింది. దీంతో ఈ బొగ్గును పూర్తి స్థాయిలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది.

సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న పలు ఏరియాల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో యాష్‌ (బూడిద) కంటెంట్‌ ఎక్కువగా ఉంటోంది. ఈ బొగ్గుకి డిమాండ్‌ కూడా తక్కువ. ఇలాంటి బొగ్గును ప్రత్యేక పద్దతిలో ప్రాసెస్‌ చేసి మిథనాల్‌గా మార్చే పరిశ్రమను హైదరాబాద్‌లో భెల్‌ ప్రారంభించింది. ప్రతీ రోజు ఈ ప్లాంటు నుంచి రోజుకు 0.25 టన్నుల మిథనాల్‌ ఉత్పత్తి అవుతోంది. దీని ప్యూరిటీ 99 శాతంగా ఉండటం గమనార్హం. అయితే ఈ బొగ్గును మిథనాల్‌ మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిని భెల్ సంస్థకి 2016లో నీతి అయోగ్‌ అప్పటించింది.

నీతి అయోగ్‌ సూచలనలు అనుసరించి కోల్‌ టూ మిథనాల్‌ ప్రాజెక్టుకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ నుంచి రూ. 10 కోట్లు కేటాయించారు. ఐదేళ్ల శ్రమ అనంతరం తొలి ప్రాజెక్టు హైదరాబాద్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ద్రవరూప మిథనాల్‌ని డీజిల్‌కి ప్రత్యామ్నాయంగా వాడుకునే వీలుంది. సాధారణంగా మిథనాల్‌ని నేచురల్‌ గ్యాస్‌ నుంచి తయారు చేస్తారు. అయితే మన దేశంలో సహాయ వాయు నిల్వలు సమృద్ధిగా లేకపోవడంతో ప్రతీసారి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

అంతేకాదు అధికంగా విదేశీ మారక ద్రవ్యం దీనిపై ఖర్చు చేస్తోంది. మరోవైపు మన దేశంలో బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నా వాటిలో బూడిద శాతం ఎక్కువగా ఉంటోంది. అందువల్ల కాలుష్యం ఎక్కువ వస్తోందనే నెపంతో కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అనేక కోర్రీలు ఎదురవుతున్నాయి. ఈ రెండు సమస్యలకు ఉమ్మడి పరిష్కారంగా భెల్‌ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. నీతి అయోగ్ అప్పగించిన పనిని అప్పగించినట్లుగా ఐదేళ్లలో సరికొత్త టెక్నాలజీతో మిథనాల్‌ ఉత్పత్తి చేసేందుకు సన్నధమైంది. ఇది పూర్తిస్థాయిలో ఉత్పాదకతను ప్రారంభిస్తే.. దేశంలో మిథనాల్‌ ఇంధనం గణనీయంగా ఉత్పత్తి కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : methanol fuel  niti aayog  methanol  hydrogen production  hydrogen mission  clean energy  bhel  

Other Articles