Rise in crime in Hyderabad, says NCRB report ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ కు మూడో స్థానం: ఎన్సీఆర్బీ నివేదిక

Cyber crime rose by 86 in telangana in 2020 ncrb

Cyber crime rose by 86% in Telangana, Cyber crime in Telangana, Cyber crime, Rise in crime in Hyderabad, National Crime Records Bureau, Crime

Cyber crimes in Telangana saw a massive jump of 86.7% in 2020 from the previous year. Overall, the crime has gone up by 12.4% in the state, as per the data for 2020 released by National Crime Records Bureau (NCRB)

ఆర్థిక నేరాల్లో హైదరాబాద్ కు మూడో స్థానం: ఎన్సీఆర్బీ నివేదిక

Posted: 09/18/2021 03:14 PM IST
Cyber crime rose by 86 in telangana in 2020 ncrb

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2020 సంవత్సరంలో జరిగిన నేరాలకు సంబంధించి జాతీయ స్థాయి గణాంకాలు విడుదల చేసింది. 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 19 నగరాలను పోల్చినప్పుడు హైదరాబాద్‌ నగరం ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో మూడో స్థానంలో ఉంది. అలాగే మహిళలపై జరిగే నేరాల్లో ఐదో స్థానం, కిడ్నాప్‌ కేసుల నమోదులో ఏడో స్థానంలో నిలిచినట్లు ఎన్నీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క నగరంలో 2018 నుంచి హత్య కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వీటితో అత్యధికం వివాదాల నేపథ్యంలో జరిగినవే. హత్యకు గురైన వారిలో 18–30 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హత్య కేసుల విషయంలో హైదరాబాద్‌ 11వ స్థానంలో ఉంది.

ఆర్థిక నేరాలకి వస్తే.. హైదరాబాద్ లో 2020 సంవత్సరంలో మొత్తం 3,427 కేసులు నమోదుకాగా, అందులో ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్‌ కేసులే 3,307 ఉన్నాయి. కాగా, ఈ తరహా కేసుల్లో ఢిల్లీ 4,445 కేసులతో అగ్రస్థానన ఉండగా, 3,927 కేసులతో ముంబై రెండో స్థానంలో ఉంది. సైబర్‌ నేరాల నమోదులో హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడం అందోళన కలిగిస్తోంది. ఇక్కడ 2018లో 428, 2019లో 1379 కేసులు నమోదయ్యాయి. గతేడాది విషయానికి వచ్చేసరికి ఈ సంఖ్య అమాంతం 2553కు చేరింది. వీటిలో ఫ్రాడ్‌ కేసులు 2020 ఉండగా వాటిలో బ్యాంకింగ్‌ ఫ్రాడ్స్‌ 1366.  

ఇక మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో హైదరాబాద్‌ ఐదో స్థానంలో ఉంది. 9,782 కేసులతో ఢిల్లీ, 4583 కేసులతో ముంబై, 2730 కేసులతో బెంగళూరు, 2636 కేసులతో లక్నో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.  హైదరాబాద్ లో నమోదైన కేసుల్లో మహిళలపై భర్తలు చేసిన దాష్టికాలకు సంబంధించినే 1226 కేసులు నమోదు కాగా, మిగిలిన వాటిలో 21 వరకట్న చావులు, 17 ఆత్మహత్యకు ప్రేరేపించడాలు, 131 కిడ్నాప్‌లు నమోదయ్యాయి. ఈ నేరాల్లోనూ ఢిల్లీనే ముందుంది. 4011 కిడ్నాపులతో దేశ రాజధాని మొదటి స్థానంలో ఉంది.

1173 కేసులతో ముంబై రెండు, 735 కేసులతో లక్నో మూడో స్థానంలో ఉండగా... 451 కేసులతో హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. కిడ్నాప్‌ బాధితుల్లో మైనర్లకు సంబంధించినవి 95 ఉదంతాలు నమోదు కాగా... వీరంతా బాలికలే కావడం గమనార్హం. మొత్తం 451 ఉదంతా ల్లోనూ 352 కేసులు బాలికలు, మహిళలకు సంబంధించినవే. హైదరాబాదులో 2018లో 81, 2019లో 86 హత్యలు జరగ్గా... 2020లో ఆ సంఖ్య 71గా నమోదైంది. వీటిలో వ్యక్తిగత కక్షల వల్ల 10, సొత్తు కోసం 4, ప్రేమ వ్యవహారాలతో 3 హత్యలు జరిగాయి.

అత్యధికంగా 39 ఉదంతాలు విభేదాల కారణంగా జరిగాయి.  హతుల్లో పురుషులు 63 మంది, స్త్రీలు 8 మంది ఉన్నారు. అత్యధికంగా 18–30 ఏళ్ల మధ్య వయసు్కలు 41 మంది ఉండగా.. వీరిలో 35 మంది పురుషులు, ఆరుగురు స్త్రీలు.  చిన్నారులపై నేరాలకు సంబంధించి నగరంలో 467 కేసులు నమోదు కాగా... ఇతర నగరాలతో పోలిస్తే 11వ స్థానంలో ఉంది. వీటిలో 318 ఉదంతాలతో పోక్సో యాక్ట్‌ కేసులో అత్యధికంగా ఉన్నాయి. ఇవి కాకుండా అపహరణలకు సంబంధించినవి 95 కేసులు ఉన్నాయి. 2020లో నగర పోలీసులు వివిధ క్రిమినల్‌ కేసులకు సంబంధించి మొత్తం 4,855 మందిని అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles