Former BJP MP Babul Supriyo joins TMC నిన్నటి వరకు కేంద్రమంత్రి.. ఇవాళ తృణముల్ ఎంపీ..

Politics of opportunity not revenge babul supriyo on joining tmc

babul supriyo tmc, babul supriyo news, babul supriyo joins tmc, babul supriyo twitter, babul supriyo join tmc, babul supriyo latest news, babul supriyo news today, tmc twitter, Babul Supriyo, Trinamool Congress, Abhishek Banerjee, Rajya Sabha MP, Derek O'Brien, West Bengal, Politics

Former union minister Babul Supriyo formally joined Trinamool Congress (TMC) in the presence of party's national general secretary Abhishek Banerjee and Rajya Sabha MP Derek O'Brien. Asansol MP clarified that his decision to join TMC is not a “politics of revenge”, but a “politics of opportunity.”

బాబుల్ సుప్రియో.. నిన్నటి వరకు కేంద్రమంత్రి.. ఇవాళ తృణముల్ ఎంపీ..

Posted: 09/18/2021 05:09 PM IST
Politics of opportunity not revenge babul supriyo on joining tmc

నిన్నటి వరకు ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆయన తన పదవిని కోల్పోయారు. దీంతో తనకు రాజకీయాలు పడవని తెలుసుకున్న ఆయన తాను ఇకపై రాజకీయాలకు దూరంగా వుంటానని ప్రకటించేశారు. అయితే అనూహ్యంగా ఆయన తన మనసు మార్చుకుని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన మరెవరో కాదు సుప్రసిధ్ద గాయకుడు కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో. బీజేపీకి వీడ్కోలు పలికిన ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు.

కొన్ని రోజులు కిందట బీజేపీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ టీఎంసీ గూటికి చేరారు. తృణముల్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్‌ బబ్రెయిన్‌ సమక్షంలో బాబుల్‌ సుప్రియో టీఎంసీలో చేరారు. మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో జూలై 31న ఇక రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు కూడా. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్‌ సుప్రియో ప్రముఖ గాయకుడు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్‌ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్‌ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్‌ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. అయితే ఇటీవల కేంద్ర మంత్రివర్గం నుంచి తనను ఉద్వాసన పలకడంతో బీజేపీకి బైబై చెప్పేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఆయన తన ప్రభావాన్ని కూడా చాటలేకపోయారని కేంద్రం ఆయనకు ఉద్వాసన పలికిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కొన్ని నెలల కిందట జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్‌ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది. అనూహ్యంగా సుప్రియో తృణమూల్‌ కాంగ్రెస్‌ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేశారు. తాజాగా తృణమూల్‌లో చేరడంతో ఆయన రాజకీయ సన్యాసం చేస్తారనే వార్తలకు తెర పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles