Debit card fraudsters of ‘Mewat Gang’ held బ్యాంకులకు కుచ్చుటోపి పెడుతున్న ముఠా ఆట కట్టు

Hyderabad police bust debit card fraudsters mewat gang seize 2 11 lakh

Debit card fraudsters, Haryana debit card fraud gang, Mewat gang, Iqbal, Ansari, salaim, Rs 2.11 lakh seized, 23 debit cards, pen camera, three cell phones, Hyderabad Police,

The city police busted three debit card fraudsters popularly known as ‘the Mewat gang,’ recovered 23 debit cards of various banks, and seized Rs 2.11 lakh of cash from the accused.

ఏటీయం కార్డులతో బ్యాంకులకు కుచ్చుటోపి: హర్యానా మేవాట్ ముఠా అరెస్ట్

Posted: 09/07/2021 12:24 PM IST
Hyderabad police bust debit card fraudsters mewat gang seize 2 11 lakh

హర్యానాకు చెందిన ముగ్గురు సభ్యులు మేవట్ గ్యాంగ్ ముఠా హైదరాబాద్ నగరంలోకి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా తమ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా, బ్యాంకు యాజమాన్యాల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన హైధరాబాద్ నగర పోలీసులు కూడా అంతే చాకచక్యంగా వారి అటను కట్టించారు. డెబిట్ కార్డ్‌ల ద్వారా  బ్యాంకులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర  ముఠా సభ్యులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. ఇటీవలే నల్లకుంట, విద్యానగర్ లలో ఈ గ్యాంగ్ డెబిట్ కార్డుల ద్వారా బ్యాంకులను మోసం చేసింది.  

టెక్నికల్ టూల్స్ వినియోగించి.. డబ్బును డ్రా చేసిన తరువాత కూడా ఏటీయం నుంచి టెక్నికల్ ఎర్రర్ వచ్చేలా చేసి.. తరువాతి రోజు బ్యాంకులకు వెళ్లి అక్కడి టెక్నికల్ ఎర్రర్ మెసేజ్ చూపించి బ్యాంకుల నుంచి మరోమారు డబ్బును తీసుకోవడమే ఈ ముఠా చేసే మోసం. అంటే ఒకే ట్రాన్స్ యాక్షన్ తో రెండు సార్లు డబ్బును తీసుకునేలా వీరు మోసం చేస్తారు. అదెలా అంటే ముందుగా ఓ ముఠా సభ్యుడు బ్యాంకు ఏటీయం కేంద్రంలోకి వెళ్లి డబ్బును డ్రా చేస్తారు. అదే సమయంలో మరో ముఠా సభ్యుడు వెళ్లి టెక్నికల్ టూల్స్ వినియోగించి ఏటీయంలో డబ్బు డ్రా అయిన తరువాత కూడా టెక్నికల్ ఎర్రర్ అనే  వెసేజ్ వచ్చేలా చేస్తాడు.

టూల్స్ ఉపయోగించి కాష్ డ్రా చేసుకున్న తరువాత కూడా టెక్నికల్ ఎర్రర్ మెసేజ్ చూపించి ఈ ముఠా బ్యాంక్‌కి వెళ్లి…. ఏటీఎంలో  క్యాష్  డ్రా కాలేదు అని ఫిర్యాదు చేస్తారనన్నారు. ఇలా బ్యాంకుల నెత్తిన శఠగోపం పెట్టడం పరిపాటిగా మారిన ఈ ముఠా హర్యానా, ఢిల్లీ సహా దేశంలోని ప్రముఖ నగరాలలో ఇప్పటికే మోసాలకు పాల్పడింది. తాజాగా ఈ ముఠా హైదరాబాద్ కేంద్రంగా మెసాలకు పాల్పడటంతో ఈ ముఠా ఆటను కట్టించారు పోలీసులు. ఈ ముఠాలో 12వ తరగతి చదివి కాసింత కంప్యూటర్ టూల్స్ పై సాంకేతిక పరిజ్ఞానం వున్న 27 ఏళ్ల ఇక్బాల్ కీలక సభ్యుడని పోలీసులు తెలిపారు.

ఇక్బాల్ తో పాటు సలీమ్ అనే 31 ఏళ్ల కంప్యూటర్ డిప్లమా చేసిన హర్యానాకు చెందిన వ్యక్తి ఈ ముఠా సభ్యులని, వీరితో పాటు నిరక్ష్యరాస్యుడైన ట్రక్కు డ్రైవర్ అన్సారీ కూడా ముఠా సభ్యుడిగా చేర్చుకుని ఏటీయం మోసాలకు ముఠా పాల్పడుతుందని పోలీసులు తెలిపారు. క్‌ల నుండి వచ్చిన డబ్బులను ఈ ముఠా సమానంగా పంచుకుంటున్నారనీ తెలిపారు. ఈ ముఠా నుండి ఒక పెన్ కెమెరా‌తో పాటు 23 డెబిట్ కార్డులు, రూ.2.11 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ ముఠా‌పై నాలుగు కేసులు ఉన్నాయనీ, నల్లకుంట, సైదాబాద్, వనస్థలిపురం‌లో కేసులు నమోదు అయ్యాయి అని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles