దేశం శాస్త్రసాంకేతిక రంగాలలో ప్రపంచంలోనే అగ్రదేశాల బారిన నిలుస్తూ.. విజయబావుటా ఎగురువేస్తుండగా.. దేశంలోని మారుమూల గ్రామాలు, పల్లెల్లో మాత్రం ఇంకా అజ్ఞనాంధకారాలు రాజ్యమేలుతూనే వున్నాయి. వీరి మూఢాచారాలు, మూఢవిశ్వాసాలను పారద్రోలేందుకు ఇప్పుడు ఏ సంఘసంస్కర్త తిరిగిరావాలో మరి అనేలా.. తయారైంది పరిస్థితి. నైరుతి రుతుపవనాలతో దేశంలో పలు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోన్ని రాష్ట్రాల్లో వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరస్థితి అలుముకుంది.
వానమ్మ, వానమ్మ వానమ్మా ఒక్కసారి వచ్చిపోవా వానమ్మా.. అంటూ వరుణుడికి భజనలు చేస్తూ.. అహ్వానిస్తూ.. చినుకు వాన కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురిపించండి అంటూ..దేవుళ్లకు మొక్కుతున్నారు. ఈ క్రమంలో కరువు తాండవిస్తున్న పలు ప్రాంతాల్లో వర్షాల కోసం అక్కడి ప్రజలు కప్పల పెళ్లిళ్లు చేస్తూ. ఇలా అయినా వరుణదేవుడు కరుణిస్తాడని మూఢాచారాలను అమలుచేస్తున్నారి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా మూఢాచారాలు, మూఢనమ్మకాలతో వింతలు చేస్తున్నారు. అయినా వరుణుడు వర్షం కురిపించకపోతే మేఘ మధనం జరగాలే తప్ప.. మూడవిశ్వాసాలను ఆచరిస్తే లాభమేంటన్ప ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకొనేందుకు…మైనర్ బాలికలను నగ్నంగా ఊరేగింపు నిర్వహించారు. అత్యంత దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దమోహ్ జిల్లాలో బజేరా పీఎస్ పరిధిలో…బనియా గ్రామం ఉంది. చాలా ఏళ్లుగా వర్షాలు పడకపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి చెందిన రైతులు పంటలను పండించలేక..నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా ఇక్కడ కరవు కరాళనృత్యం చేస్తోంది. బాలికలను నగ్నంగా ఊరేగింపు చేస్తే..వరుణ దేవుడు కరుణిస్తాడని..వర్షాలు కురుస్తాయనే అంధ విశ్వాసం గ్రామ పెద్దల్లో కనిపించింది.
అనుకున్నదే తడవుగా…సభ్య సమాజం తలదించుకొనేలా ఒడిగట్టారు. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభిచండం జరిగిందని, బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి…వారితో కప్ప ఊరేగింపు నిర్వహించారని దమోహ్ జిల్లా ఎస్పీ వెల్లడించారు. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more